చంద్రబాబుతో ఆ నటుడు ఏం మాట్లాడారు?

admin
Published by Admin — March 27, 2026 in Politics
News Image

సీఎం చంద్ర‌బాబు(cm chandrababu)తో బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు సంజ‌య్‌ద‌త్(sanjay dutt) భేటీ(meeting) అయిన సంగతి తెలిసిందే. సుమారు 40 నిమిషాల‌కుపైగానే ఇరువురు చ‌ర్చించుకున్న‌ట్టు తెలిసింది. అయితే.. ఇంత హ‌ఠాత్తుగా సంజ‌య్ ద‌త్ అమ‌రావ‌తికి రావ‌డం.. చంద్ర‌బాబుతో భేటీ కావ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.

అంతేకాదు... ముంద‌స్తు షెడ్యూల్‌ను కూడా చంద్ర‌బాబు బుధ‌వారం సాయంత్రం ఖాళీగా ఉంచారు. ఉద‌యం 11 నుంచి సాయం త్రం 4.30 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే చంద్ర‌బాబు షెడ్యూల్‌ను అధికారులు విడుద‌ల చేశారు. జ‌ల్ జీవ‌న్ మిష‌న్‌పై స‌మీక్ష‌లు.. రాజ‌ధానిలో జ‌రిగిన అగ్ని ప్ర‌మాదంపై అధికారుల‌తో స‌మీక్ష‌ల‌కు ఉదయం స‌మ‌యం వెచ్చించారు. ఎప్పుడూ లేని విధంగా సాయంత్రం 4.30 గంట‌ల‌కే ఆయ‌న షెడ్యూల్ పూర్త‌యింది. దీంతో అమ‌రావ‌తిలోని స‌చివాల‌యంలోనే చంద్ర‌బాబు ఉన్నారు.

ఆ త‌ర్వాత‌.. కొద్ది సేప‌టికి సంజ‌య్‌ద‌త్ ముంబై నుంచి నేరుగా స‌చివాల‌యానికి వ‌చ్చారు. దాదాపు 40 నిమిషాల త‌ర్వాత‌.. ఆయ‌న బ‌య‌ట‌కు రావ‌డం గ‌మ‌నార్హం. అయితే..లోప‌ల ఏం చ‌ర్చించార‌న్న విష‌యాన్ని సంజ‌య్ ద‌త్ వెల్ల‌డించ‌లేదు. మీడియాతోనూ ఆయ‌న మాట్లాడ‌కుండానే కారెక్కి వెళ్లిపోయారు. కాగా.. ఇటీవ‌ల మంత్రి నారా లోకేష్ ముంబైలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌.. నేరుగా సంజ‌య్‌ద‌త్ నివాసానికి వెళ్లి.. గంట‌న్న‌ర‌కు పైగా ఆయ‌న‌తో చ‌ర్చించారు. ఈ వ్య‌వ‌హారం కూడా అప్ప‌ట్లో ఆస‌క్తిగా మారింది.

అయితే.. ఏపీలో సినీ రంగాన్ని డెవ‌ల‌ప్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న ద‌రిమిలా సంజ‌య్‌ద‌త్ స‌ల‌హాలు తీసుకున్నామ‌ని అప్ప‌ట్లో మంత్రి లోకేష్ వెల్ల‌డించారు. మ‌రి ఇప్పుడు కూడా అదే ప‌నిపై ద‌త్ ఇక్క‌డ‌కు వ‌చ్చారా? అనేది చూడాలి.ఏదేమైనా.. తొలిసారి బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు సంజ‌య్ ద‌త్ రాక‌తో.. ఈ అంశం ఆస‌క్తిగా మారింది.

Tags
Cm chandrababu sanjay dutt meeting
Recent Comments
Leave a Comment

Related News