జగన్ కు జనం సినిమా..లోకేశ్ సెటైర్లు

admin
Published by Admin — March 28, 2026 in Andhra
News Image

అమరావతి(amaravati) రాజధానికి చట్టబద్ధత కల్పించేందుకు ప్రత్యేకంగా తీర్మానం ప్రవేశపెట్టాలన్న ఉద్దేశంతో ఈ రోజు ప్రత్యేకంగా అసెంబ్లీ(assembly) సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, యథా ప్రకారం ఈ రోజు సభకు కూడా వైసీపీ సభ్యులు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో వారిపై మంత్రి నారా లోకేష్(nara lokesh) సెటైర్లు వేశారు. ఈ రోజు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాలేదని. వారి చిత్తశుద్ధికి. వారి వైఖరికి ఇది నిదర్శనం అని అన్నారు.

పాదయాత్ర చేసి చంద్రబాబుకు సినిమా చూపిస్తా అంటూ జగన్(jagan) చేసిన వ్యాఖ్యలపై కూడా లోకేష్ స్పందించారు. గత ఎన్నికల్లో జగన్ కు ప్రజలు బ్లాక్ బస్టర్ సినిమా చూపించారని, అది సరిపోయినట్ల లేదని లోకేష్ చురకలంటించారు. అయినా, జగన్ చూపిస్తానంటున్న సినిమా 11 రోజులు కూడా ఆడదని లోకేష్ ఎద్దేవా చేశారు. అమరావతి ప్రత్యేక రాజధానిగా గుర్తిస్తూ తీర్మానం చేస్తున్నామని, దీని పట్ల రాష్ట్ర ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

మరోసారి తుగ్లక్ చర్యలు చూసేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ఏప్రిల్ 2న పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని లోకేష్ చెప్పారు. అయితే, పార్లమెంటులోనైనా ఈ తీర్మానంపై వైసీపీ తన వైఖరి ఏంటో చెబుతుందో లేదో వేచి చూడాలని లోకేష్ అన్నారు.

Tags
Minister lokesh satires cinema amaravati
Recent Comments
Leave a Comment

Related News