ప్రేమలో పడ్డ కాలభైరవ.. కీరవాణి కోడలిగా స్టార్ హీరోయిన్!

admin
Published by Admin — March 11, 2026 in Movies
News Image

టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కుటుంబంలో త్వరలోనే ఒక శుభకార్యం జరగబోతుందంటూ సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. కీరవాణి కుమారుడు, యువ సంగీత దర్శకుడు కాలభైరవ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలయ్యాయని ఫిలిం నగర్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ వార్తలో అసలైన ట్విస్ట్ ఏంటంటే.. కాలభైరవ పెళ్లాడబోయేది మరెవరో కాదు, `బలగం`, `మసూద` చిత్రాలతో పాపులర్ అయిన హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ అని ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా స్నేహం ఉందని, ఇప్పుడు అది పెళ్లి వరకు దారితీసిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన కావ్య, ఇప్పుడు కీరవాణి కోడలిగా వెళ్లబోతుందనే వార్త ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ప్రస్తుతానికి ఈ వివాహం గురించి ఇరు కుటుంబాల నుండి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ జంట గురించి రకరకాల పోస్ట్‌లు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్‌లో మెగా, అక్కినేని ఫ్యామిలీ వెడ్డింగ్స్ సందడి ముగియడంతో, ఇప్పుడు కీరవాణి వారసుడి పెళ్లి ఎప్పుడు ఉంటుందా అని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మ‌రి నిజంగానే కాలభైరవ - కావ్య కళ్యాణ్ రామ్ పెళ్లి పీటలు ఎక్కుతారా? లేదా ఇది కేవలం పుకారుగానే మిగిలిపోతుందా? తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Tags
Kaala Bhairava Kavya Kalyanram MM Keeravani Tollywood Weddings Tollywood
Recent Comments
Leave a Comment

Related News