పుణ్యక్షేత్రాల్లో తమకు తోచినట్లుగా వ్యవహరిస్తూ.. నిబంధనల్ని.. సంప్రదాయాల్ని పక్కన పెట్టేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరించే తీరు అంతకంతకూ ఎక్కువ అవుతోంది. అదేమంటే.. తప్పైపోయిందంటూ వీడియోలు పెట్టేసి.. చేసిన తప్పు నుంచి ఇట్టే బయటపడిపోతున్న వైనాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. మనకు నచ్చింది చేద్దాం. వివాదంగా మారితే సారీ చెప్పేస్తే పోలా? అన్నట్లుగా సెలబ్రిటీలు.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ తీరు ఉందని చెప్పాలి. తాజాగా తిరుమలలో ఇదే రీతిలో వ్యవహరించి కొత్త వివాదానికి కారణమయ్యారు బిగ్ బాస్ ఫేం తనూజ(bigboss telugu fame tanuja). ఆమెకు దన్నుగా నిలిచింది మరెవరో కాదు.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. మాధురి దంపతులు.
తిరుమల(tirumala) తిరుపతి దేవస్థానం నిబంధనలకు విరుద్ధంగా వీరంతా వ్యవహరించారు. తాజాగా తనూజ పుట్టినరోజు(birthday) సందర్భంగా తిరుమలకు కేక్ తీసుకొచ్చి గెస్టు హౌస్ లో కట్ చేసిన వైనం వివాదంగా మారింది. కేక్ ను తిరుమలకు తీసుకెళ్లటం.. కట్ చేయటం లాంటివి టీటీడీ నిబంధనలకు విరుద్ధం. బిగ్ బాస్ తనూజ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చారు.
శ్రీపద్మావతి విచారణ కేంద్రం పరిధిలోని శ్రీవిభవ గెస్టు హౌస్ లో రూం తీసుకున్నారు. అందులోమాధురి.. తనూజ చేత కేక్ కట్ చేయించారు. అనంతరం దీనికి సంబంధించిన వీడియోను ఇన్ స్టాలో షేర్ చేసుకున్నారు. గతంలోనూ దువ్వాడ శ్రీనివాసరావు.. మాధురిలు తిరుమలలో ఫోటో షూట్ చేసుకోవటం విమర్శలకు తావిచ్చింది. ఇప్పుడుతనూజ చేత కేక్ కట్ చేయించిన వైనంపౌ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఈ తీరుపై తిరుమల అధికారులు పరిశీలిస్తున్నారు. తగిన చర్యలు చేపట్టేందుకు వీలుగా తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారని చెబుతున్నారు.