ఒక్కటవుతున్న `విరోష్` జంట‌.. ఇద్ద‌రి మ‌ధ్య‌ ఏజ్ గ్యాప్ తెలిస్తే షాకే!

admin
Published by Admin — February 23, 2026 in Movies
News Image

టాలీవుడ్‌లో గత కొన్నాళ్లుగా ఊరిస్తున్న మోస్ట్ అవైటెడ్ వెడ్డింగ్ మరికొద్ది గంటల్లోనే జరగబోతోంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఎట్టకేలకు తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించి పెళ్లి పీటలెక్కిస్తున్నారు. సోషల్ మీడియాలో `ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్` పేరుతో వచ్చిన ఒక్క పోస్ట్ నెట్టింట తుఫాను సృష్టించింది. ఈ జంట పెళ్లి కోసం రాజస్థాన్‌లోని ఉదయపూర్‌కు బయల్దేరడంతో అప్పుడే సందడి మొదలైపోయింది.

ఈ పెళ్లి వార్త బయటకు వచ్చినప్పటి నుంచి నెటిజన్లలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ఈ క్రేజీ కపుల్ మధ్య ఉన్న ఏజ్ గ్యాప్‌. విజయ్ దేవరకొండ 1989 మే 9న జన్మించగా, రష్మిక 1996 ఏప్రిల్ 5న జన్మించారు. అంటే వీరిద్దరి మధ్య దాదాపు 7 ఏళ్ల వయసు తేడా ఉంది. విజయ్ ఇప్పుడు 36 ఏళ్ల వయసులో ఉండగా, రష్మిక 29 ఏళ్లలో ఉన్నారు. సాధారణంగా సెలబ్రిటీల మధ్య ఏజ్ గ్యాప్ గురించి చర్చ జరగడం సహజమే అయినా, వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూస్తుంటే ఏజ్ అనేది జస్ట్ నెంబ‌ర్ మాత్రమే అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.

వీరిద్దరి ప్రయాణం `గీత గోవిందం` సినిమాతో మొదలైంది. ఆ సినిమాలో వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత `డియర్ కామ్రేడ్`సమయంలో వీరి స్నేహం కాస్తా గాఢమైన ప్రేమగా మారింది. అప్పటి నుండి వీరు కలిపి వెకేషన్లకు వెళ్లడం, ఒకే రకమైన ఫోటోలు షేర్ చేయడం వంటివి చూసి అభిమానులు ముందే పసిగట్టారు. ఎట్టకేలకు ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని రాజకోటలో సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటి కాబోతోంది.

పెళ్లి వేడుకలు ఉదయపూర్‌లో ముగిసిన తర్వాత, మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నార‌ని స‌మాచారం. నగరంలోని ఒక లగ్జరీ హోటల్‌లో జరగనున్న ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరోలు, దర్శకులతో పాటు రాజకీయ ప్రముఖులు భారీగా హాజరుకానున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా ఈ విరోష్ వెడ్డింగ్ హంగామాతో నిండిపోయింది.

Tags
Virosh Wedding Vijay Deverakonda Rashmika Mandanna The Wedding Of Virosh Virosh Tollywood
Recent Comments
Leave a Comment

Related News