తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు భారీ విరాళం సమర్పించనున్నారు. 121 కిలోల బంగారు ఆభరణాలను అందించ నున్నారు.. అంటూ.. గత వారం రోజులుగా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గురువా రం ఉదయం.. సదరు భక్తుడు.. సీఎం చంద్రబాబు సమక్షంలో శ్రీవారికి ఆయా కానుకలను అందించారు. సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని.. భారీ ఊరేగింపుగా ఆభరణాలు తీసుకువెళ్లి.. శ్రీవారికి సమర్పించారు.
ఏం ఉన్నాయి..?
శ్రీవారికి ఇప్పటి వరకు అనేక మంది భక్తులు అనేక రూపాల్లో కానుకలు సర్పించారు. అయితే.. ఒకేసారి శ్రీవారికి పాదాల నుంచి శిరస్సు వరకు అలంకరించే అని రకాల ఆభరణాలను సమర్పించడం ఇదే తొలిసారి. మొత్తం 46 రకాల బంగారు ఆభరణాలను ఈ భక్తుడు విరాళంగా సమర్పించారు. వీటిలో శ్రీవారికి వజ్ర కిరీటం నుంచి కటి, వరద హస్తాలు, బంగారు మాలలు, పాదుకలు, ఉంగరాలు, ముంజేతులకు ధరించే కంకణాలు కూడా ఉన్నాయి. వీటిలో వజ్రాలు పొదిగిన ఆభరణాలు కూడా ఉండడం గమనార్హం. అలాగే, శ్రీవారి పట్టమహిషి.. పద్మావతీ అమ్మవారికి 15 కేజీల బరువైన పసిడి చీరతో పాటు పలు ఆభరణాలు ఇందులో ఉన్నాయి.
ఎవరీ భక్తుడు.. ?
శ్రీవారికి ఇప్పటి వరకు ఎవరూ ఇవ్వని రీతిలో 121 కిలోల బంగారాన్ని ఆభరణాల రూపంలో అందించిన భక్తుడు చెన్నైకి చెందిన వర్ధమాన్ జైన్. ఈయన గతంలో 2025 జనవరి 19 రూ.6 కోట్లు, ఈ ఏడాది మే 16న ఎలక్ట్రిక్ బస్సును కూడా విరాళంగా అందించారు. ఇక, వర్ధమాన్ జైన్ విషయానికి వస్తే.. ఈయన చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త. ఆయన హెల్త్‌కేర్ రంగంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారు..` యాక్సెస్ హెల్త్‌కేర్`తో అంతర్జాతీయ వ్యాపారం చేస్తున్నారు. చెన్నైలోని 'వర ఫ్యూచర్ ఎల్ఎల్పీ' చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇదొక బ్రహ్మాండం: చంద్రబాబు
శ్రీవారికి చెన్నై భక్తుడు సమర్పించిన కానుకల కార్యక్రమంలో చంద్రబాబు సైతం పాల్గొన్నారు. ఆయనతో కలిసి.. ప్రత్యేక పూజల్లోనూ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం.. ఇదొక మహత్తర ఘట్టంగా.. బ్రహ్మాండ మైన భక్తికి నిదర్శనంగా పేర్కొన్నారు జైన్ కుటుంబం తరతరాలుగా స్వామికి కానుకలు సమర్పిస్తోందన్నారు. శ్రీవారికి చేయించిన ప్రతి ఆభరణం బంగారంతోపాటు మనసు పెట్టి చేయించారని.. భక్తిని చాటుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం తనకు లభించడం.. శ్రీవారి ఆశీస్సులతోనే సాధ్యమైందన్నారు.