‘భోగి’ ప్రమోషన్లలో ఆ హీరోయిన్ మిస్

admin
Published by Admin — November 27, 2026 in Movies
News Image
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన నారీ నారీ న‌డుమ మురారి చిత్రంతో చాలా కాలం తర్వాత మంచి హిట్ కొట్టాడు చార్మింగ్ స్టార్ శ‌ర్వానంద్. దీని త‌ర్వాత త‌న శైలికి పూర్తి భిన్నంగా ఊర మాస్ అవ‌తారంలో భోగి సినిమా చేశాడు. మాస్ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఎప్పుడో ఆగ‌స్టు చివ‌రి వారంలో రావాల్సిన సినిమా ఇది. ఒకటికి రెండుసార్లు వాయిదా పడి త‌ర్వాత న‌వంబ‌రు 12కు వాయిదా ప‌డింది. కానీ ఆ డేట్‌లో కూడా సినిమా న‌వంబ‌రు 27న రిలీజ్ కాబోతోంది. 
 
లేటుగా రిలీజ్ రేసులోకి వచ్చిన ఈ మూవీని టీమ్ గట్టిగా ప్రమోట్ చేస్తోంది కొన్ని రోజులుగా. ఐతే ఈ సినిమా ఈవెంట్లలో, ఇతర ప్రమోషన్లలో ఎక్కడా లీడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలుగులో ఈ సినిమా చేసినా ప్రమోషన్లకు బాగా సహకరిస్తుంది అనుపమ. గత నెలలో క్రేజీ కళ్యాణంను కూడా బాగా ప్రమోట్ చేసింది. కానీ భోగి సినిమాను మాత్రం పట్టించుకోవడం లేదు. ఈవెంట్లకు హాజరు కాకపోవడమే కాదు.. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా గురించి ఒక పోస్టు కూడా పెట్టలేదు.
 
అనుపమ సంగతి ఇలా ఉంటే భోగి సినిమాలో సెకండ్ హీరోయిన్ అయిన డింపుల్ హయతి హంగామా మామూలుగా లేదు. ఈ సినిమాకు సంబంధించి రెండు ఈవెంట్లలో శర్వాతో డింపుల్ చాలా క్లోజ్ గా ఉండడం మీద పెద్ద డిస్కషన్ నడిచింది సోషల్ మీడియాలో. ఈ చర్చ తన పెళ్లి మీదికి కూడా వెళ్ళింది. సినిమాలో డింపుల్ క్యారెక్టర్ మరీ ఎక్కువ నిడివితో ఉండదని, ప్రాధాన్యం కూడా తక్కువే అంటున్నారు. కానీ ఆమె ప్రమోషన్లలో ఇంతగా హైలైట్ అవుతోంది.
 
ఎంతో బాధ్యతగా ఆమె సినిమా ప్రచారానికి తోడ్పాటు అందిస్తోంది. మరి మెయిన్ హీరోయిన్ అనుపమకు టీంతో ఎక్కడ చెడింది, ఆమె ఎందుకు ప్రమోషన్లకు దూరంగా ఉంది అన్నది సందేహం. దీనిపై టీం కానీ, అనుపమ కానీ క్లారిటీ ఇస్తారేమో చూడాలి. సంప‌త్ నందితో వ‌రుస‌గా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్న సీనియ‌ర్ నిర్మాత కె.కె.రాధామోహనే ఈ చిత్రాన్ని కూడా నిర్మించారు. ఇది పూర్తిగా తెలంగాణ గ్రామీణ నేప‌థ్యంలో సాగే రా అండ్ ర‌స్టిక్ మూవీ. వ‌యొలెన్స్ ఒక రేంజిలో ఉంటుంద‌ని ప్రోమోలు చూస్తే అర్థ‌మ‌వుతోంది. శ‌ర్వా కెరీర్లోనే అత్య‌ధిక బ‌డ్జెట్లో తెర‌కెక్కిన ఈ సినిమా అత‌డికి ఎలాంటి ఫ‌లితాన్నిస్తుందో చూడాలి.
Tags
Bhogi movie promotions Anupama Parameswaran
Recent Comments
Leave a Comment

Related News