జనానికి ఉన్న క్లారిటీ జగన్ కు లేదా?

admin
Published by Admin — November 08, 2026 in Politics
News Image

స్థానిక ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోరంగా ప‌రాజ‌యం పాలైంది. అయితే.. దీని నుంచి ఏమైనా పాఠాలు నేర్చుకుంటుందా? లేదా.. య‌ధాలాపంగా స‌ర్కారుపై విమ‌ర్శ‌లు చేస్తూనే ఉంటుందా? అనేది చూడాలి. ప్ర‌స్తుతం వ‌చ్చిన ఫ‌లితాల‌ను గ‌మ‌నిస్తే.. వైసీపీపై ప్రజల్లో భిన్నమైన అభిప్రాయాలు, భిన్న కోణాలు కనిపిస్తున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, తాజాగా జ‌రిగిన‌ స్థానిక సంస్థల ఎన్నికల వరకు వైసీపీ డౌన్ ఫాల్ ట్రెండ్‌నే కొన‌సాగించింది.  

ఇప్ప‌టిక వైసీపీ గత పరిపాలనపై అసంతృప్తి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. వైసీపీ 2019-2024 మధ్య కాలంలో అభివృద్ధి కంటే ఉచిత పథకాలకే ప్రాధాన్యత ఇచ్చిందని, దీనివల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందనే భావన పట్ట‌ణ ప్రాంతాల‌ ప్రజల్లో ఉంది. పారిశ్రామికీకరణ, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనను నిర్లక్ష్యం చేశారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇవి తాజాగా అన్ని కార్పొరేష‌న్ల‌లోనూ క‌నిపించింది. అంటే.. ప్ర‌జ‌లు నాటి అనుభ‌వా ల‌ను ఇంకా మ‌రిచిపోలేద‌నే చెప్పాలి.

ప్రతిపక్ష హోదా కోసం పోరాటం చేయ‌డం.. అసెంబ్లీ బహిష్కరణ వంటివి కూడా జ‌గ‌న్ ఇమేజ్‌పై ప్ర‌భావం చూపించాయి. తనకు 'ప్రతిపక్ష నేత' హోదా ఇస్తేనే అసెంబ్లీకి హాజరవుతానని పట్టుబట్టడం ప్రజల్లో కొంత చర్చకు దారితీసింది. ప్రజా సమస్యలపై సభలో పోరాడకుండా ఈ విధమైన నిర్ణయం తీసుకోవడంపై ప్రజల నుండి భిన్నమైన స్పందనలు వచ్చాయి. వైఎస్సార్‌సీపీ అవలంబిస్తున్న కొన్ని రాజకీయ, దూకుడు విధానాలు రాష్ట్రంలో రాజకీయ ఘర్షణలను పెంచుతున్నాయని, వైఫల్యాలను సమీక్షించుకోవడంలో విఫలమవుతున్నారని మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గం భావిస్తోంది.

ముఖ్యంగా.. ర‌ప్పా ర‌ప్పా సంస్కృతి, గొడ్డ‌లి పార్టీ నినాదాలు(టీడీపీ చేస్తున్న‌వి) వంటి ప్ర‌జ‌ల్లోకి బాగానే వెళ్లాయ‌న్న విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థులతో పోటీ పడటానికి కూడా వైసీపీ నేత‌లు కష్టపడడ‌డం క‌నిపించింది. ఇది పార్టీ రాజకీయ భవిష్యత్తు సవాలుగా మారిందని స్ప‌ష్ట‌మ‌వుతోంది. అయితే.. దీనిని గ్ర‌హించే విష‌యంలో వైసీపీ ఇంకా పిల్లి మొగ్గ‌లు వేస్తూనే ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమవుతోందని దీంతో తామే అధికారంలోకి వ‌చ్చేస్తామ‌ని అంటున్నారు. కానీ.. వాస్త‌వం మాత్రం అద్దంలో చూపించిన‌ట్టుగా క‌నిపిస్తున్నా.. ప్ర‌జ‌ల ఆలోచ‌న స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నా.. వైసీపీ మాత్రం ఈ నిజాన్ని ఒప్పుకొనే ప‌రిస్థితిలో లేక పోవ‌డం గ‌మ‌నార్హం. 

Tags
Ycp clarity people
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News