రేవంత్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్‌

admin
Published by Admin — October 27, 2026 in Telangana
News Image

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో పెద్ద దుమారం రేగింది. ప్ర‌భుత్వంపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ ఒక‌వైపు విమ‌ర్శ‌లు చేస్తుంటే.. దీనికి ప్ర‌తిగా కౌంట‌ర్లు ఇవ్వాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు, నాయ‌కుల‌కు తేల్చి చెబుతున్నారు. కానీ, దీనికి భిన్నంగా కొంద‌రు సొంత పార్టీ ఎమ్మెల్యేలు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ముఖ్య‌మంత్రికి ఇబ్బందిగా మారుతోంది. తాజాగా జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్న ఆయ‌న‌.. నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధిపై గ‌ళం విప్పారు. అయితే.. ఈ క్ర‌మంలో స‌ర్కారును ఇరుకున పెట్టేలా వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

త‌న నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నులు జ‌ర‌గ‌డం లేద‌ని అనిరుధ్ రెడ్డి ఆరోపించారు. దీనిపై డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క స‌హా ప‌లువు రు మంత్రుల‌ను క‌లిశాన‌ని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ నిధులు ఇవ్వ‌డం లేద‌ని పేర్కొన్నారు. చేయాల్సిన ప‌నులు చాలా ఉన్నాయ‌ని ఆయ న చెబుతున్నారు. వాటికి సంబంధించిన అన్ని వివ‌రాలు, స‌మ‌గ్ర ప్ర‌ణాళిక‌ల‌ను కూడా మంత్రుల‌కు ఇచ్చాన‌ని తెలిపారు. నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి నిధుల‌ను ఇవ్వాల‌ని ప‌దే ప‌దే కోరుతున్నా ఇవ్వ‌డం లేద‌ని ఆయ‌న చెబుతున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

``నేను పోతే త‌ప్ప‌.. నిధులు వ‌చ్చేలా లేవు`` అన్నారు. త‌న అనుచ‌రులు, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేయ‌నున్న‌ట్టు అనిరుధ్ రెడ్డివెల్ల‌డించారు. నిధులు ఇవ్వాల‌ని ఎన్నిసార్లు అడుగుతామ‌ని ప్ర‌శ్నించారు. నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ది చేస్తామ‌ని.. ఎన్నిక‌ల కు ముందు ఇచ్చిన హామీపై ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నార‌ని ఆయ‌న తెలిపారు. ``నేను బ‌తికి ఉండ‌గా నిధులు వ‌చ్చేలా లేవు. అందుకే నిరాహార దీక్ష‌కు దిగుతున్నా. నేను చ‌నిపోయిన త‌ర్వాత అయినా..నిధులు ఇవ్వండి. నియోజ‌క‌వర్గం ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు నెర‌వేర్చండి.`` అని అనిరుధ్ వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కేవ‌లం ఒక‌వైపే చూస్తున్నార‌ని.. అభివృద్ధి చేయ‌కుండా ఎలా గెలుస్తామ‌ని ప్ర‌శ్నించారు.

ఎందుకు?

ఇక‌, జ‌డ్చ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ ఎస్ నేత ల‌క్ష్మారెడ్డిదూకుడు పెరిగింది. గ‌త ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప తేడాతో ఓడిపోయిన ఆయ‌న‌.. ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర‌లు, ప్ర‌జ‌ల‌ను క‌లుసుకుంటూ.. కాంగ్రెస్ పార్టీపైనా.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిపైనా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఎక్క‌డా అభివృద్ది క‌నిపించ‌డం లేద‌ని.. ఎమ్మెల్యే నిద్ర‌పోతున్నార‌ని.. ప్ర‌భుత్వం ప‌నిచేయ‌డం లేద‌ని ఆయ‌న ఆరోపిస్తున్నారు. ఈ ప్ర‌భావం ప్ర‌త్య‌క్షంగా ఎమ్మెల్యేపై ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలోనే అనిరుధ్ రెడ్డి ఇలా వ్యాఖ్యానించి ఉంటార‌ని కాంగ్రెస్ నాయ‌కులు చెబుతున్నారు. అయితే.. పార్టీకి డ్యామేజీ అయ్యేలా.. ప్ర‌తిప‌క్షాల‌కు ఆయుధాలు ఇచ్చేలా వ్యాఖ్యానించ‌డం స‌రికాద‌ని సూచిస్తున్నారు. 

Tags
Congress MLA anirudh Reddy cm revanth reddy
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News