మరో విదేశీ పర్యటనకు లోకేష్!

admin
Published by Admin — November 22, 2026 in Politics
News Image
ఏపీ ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీ అందిపుచ్చుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 6 నుంచి 11వ తేదీ వరకు డెన్మార్క్ రాజధానిలో ఆయన పర్యటించబోతున్నారు. కోపెన్హాగన్ లో జరగబోతున్న ఏఐ ఫర్ గవర్నమెంట్ ఇన్నోవేషన్ ఫోరం కార్యక్రమంలో పాల్గొనేందుకు లోకేష్ వెళ్తున్నారు. దాంతోపాటు లండన్ లో కూడా లోకేష్ పర్యటించబోతున్నారు. 
 
ఈ ప్రకారం సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు జిఓఆర్టి 2172 ను జారీ చేశారు. ఈ పర్యటనకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతోపాటు ఇతర కేంద్ర ప్రభుత్వ విభాగాల నుండి రాజకీయ అనుమతులు రావాల్సి ఉంది. ఈ టూర్ ఖర్చులు మొత్తం ఏపీ ఐటి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ శాఖ భరించనుంది. ప్రయాణ సమయంతో కలిపి మొత్తం 6 రోజులపాటు విదేశాల్లో లోకేష్ పర్యటన సాగనుంది.
Tags
Copenhagon AI forum minister lokesh tour
Recent Comments
Leave a Comment

Related News