ఎన్నికల ఫలితాల్లో చిత్రవిచిత్రాలు!

admin
Published by Admin — November 03, 2026 in Andhra
News Image

చాలామంది నాయకుల రాజకీయ ప్రస్థానం వార్డు మెంబర్ స్థాయి నుంచే మొదలవుతుంది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన నేతలు ఎందరో ఉన్నారు. అందుకే, తమ వార్డులో తమకు పట్టుంది..మంచి పేరుంది...పలుకుబడి ఉంది...అని నమ్మకం ఉన్న వారు వార్డు మెంబర్లుగా ఎన్నికల అరంగేట్రం చేస్తుంటారు. కొన్ని చోట్ల వార్డుల్లో సిట్టింగ్ మెంబర్లు, కౌన్సిలర్లు రెండోసారి కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. ఈ సారి ‘పుర’ పోరులో కూడా ఇలా తమ వార్డుల్లో గెలిచి తమను తాము ప్రూవ్ చేసుకోవాలని అని చాలామంది అనుకున్నారు. అందులో కొందరు అనూహ్యంగా తమ సొంత వార్డుల్లో ఓటమి పాలైన వైనం ఆసక్తికరంగా మారింది. ఇలా ఈ ఎన్నికల ఫలితాల్లో కొన్ని ఆసక్తి రేకెత్తించాయి.

ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడుతున్నాయి. చాలా చోట్ల కూటమి బలపరిచిన అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. కొన్ని చోట్ల వైసీపీ పోటీ ఇస్తోంది. అయితే, కొన్ని స్థానాల్లో ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో టీడీపీ తరఫున మున్సిపల్ ఛైర్మన్ గా బరిలోకి దిగిన అభ్యర్థి మేడిశెట్టి శేషగిరిరావు తన సొంత వార్డు అయిన 6వ వార్డులో ఓటమి పాలయ్యారు. అక్కడ వైసీపీ అభ్యర్థి గెలిచారు. ఇక, అదే మాదిరిగా వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి చింతపల్లి నాగేశ్వర రావు తన సొంత వార్డు అయిన పదో వార్డులో పరాజయం పాలయ్యారు.

నెల్లూరులో వైసీపీ మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి తన సొంత డివిజన్ లో ఓడిపోయారు.

అదే విధంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జనసేన రెబల్ అభ్యర్థి గెలుపొందారు. 11వ వార్డు నుంచి జనసేన రెబల్ అభ్యర్థి శిరీష,12వ వార్డు నుంచి జనసేన రెబల్ అభ్యర్థి సంధ్య విజయం సాధించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఒకటో వార్డులో ఒక్క ఓటు తేడాతో వైసీపీ అభ్యర్థి రామకృష్ణమ్మ గెలిచారు. అయితే, ఆ వార్డులో పోటీ పడుతున్న బీజేపీ అభ్యర్థి లక్ష్మీదేవి రీకౌంటింగ్ కోరారు.

Tags
Municipal polls results today
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News