ఎన్నిక‌ల ముందు ఏపీలో చంద్ర‌బాబు స్ట్రాట‌జీ!

admin
Published by Admin — September 23, 2026 in Andhra
News Image

ఏపీలో త్వ‌ర‌లోనే స్థానిక సంస్థ‌లకు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వ‌చ్చే నెల రెండో వారంలోనే జిల్లాప‌రిష‌త్‌లు, మం డ ల ప‌రిష‌త్‌లు స‌హా.. మునిసిపాలిటీల‌కు, కార్పొరేష‌న్ల‌కు కూడా ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రానుంది. ఈ నేప‌థ్యంలో ఒక వైపు రాజ‌కీయ వేడి రాజుకుంది. కూట‌మి ప్ర‌భుత్వం ఏక‌గ్రీవాల వైపు వ‌డివ‌డిగా అడుగులు వేస్తోంది. అలానే ప్ర‌జ‌ల ను క‌లుసుకుని రెండున్న‌రేళ్ల పాల‌న‌పై పెద్ద ఎత్తున క‌స‌ర‌త్తు కూడా చేసింది. ఇక‌, ఇప్పుడు సీఎం చంద్ర బాబు వ్యూహాత్మ‌కంగా అభివృద్ది అజెండాను ఎత్తుకున్నారు.

ప్ర‌స్తుతం త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో ప‌ర్య‌టిస్తున్న సీఎం చంద్ర‌బాబు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మునిసిపా లిటీలు, కార్పొరేష‌న్ల ప‌రిధిలో అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన ప‌నుల‌కు శ్రీకారం చుట్టారు. వీటి విలువ సుమారు 11,500 కోట్ల రూపాయ‌లుగా ఉంది. ఆయా మునిసిపాలిటీలు, కార్పొరేష‌న్ల‌లో ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌, మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వ‌నున్నారు. ముఖ్యంగా ప్ర‌తి ఇంటికీ తాగునీరు, సాగు నీటి ప్రాజెక్టుల‌ను కూడా ఈ నిధుల‌తో చేప‌ట్ట‌నున్నారు.

త‌ద్వారా కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో స్థానిక ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు అవ‌కాశం ఉంటుంది. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. ప్ర‌తి మునిసిపాలిటీనీ అభివృద్ధి చేసే క్ర‌తువులో భాగంగా.. ఈ నిధులుకేటాయించిన ట్టు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పనులతో కలిపి మ‌రిన్ని నిధులు కేటాయించే ప్ర‌తిపాద‌న ఉంద‌న్నారు. `హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌`లో ఈ ప‌నులు చేప‌ట్ట‌నున్న‌ట్టు సీఎం వివ‌రించారు.

విశాఖ‌కు ఎక్కువ‌గా..

విశాఖ‌ప‌ట్నానికే నిధుల‌ను ఎక్కువ‌గా ఇవ్వ‌నున్న‌ట్టు చంద్ర‌బాబు చెప్పారు. మొత్తం 4 వేల కోట్ల పైచిలుకు మొ త్తాన్ని విశాఖ‌కు కేటాయించారు. త‌ద్వారా విశాఖ కార్పొరేష‌న్ ప‌రిధిలో ప‌నుల‌ను పూర్తిచేయాల‌ని నిర్ణ‌యించుకు న్నారు. స్థానికంగా ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌తోపాటు.. మురుగు నీటి పారుద‌ల కాల్వ‌ల నిర్మాణం, వంటి ప‌నుల‌కు నిధుల‌ను వెచ్చించ‌నున్నారు. మ‌రోవైపు.. ఈ ప‌నుల పూర్తితో విశాఖ కార్పొరేష‌న్ స‌హా.. రాష్ట్ర వ్యాప్తంగా కూట‌మి హ‌వా మ‌రింత పెరుగుతుంద‌న్న అంచ‌నాలు వున్నాయి.

Tags
Cm chandrababu civic polls kuppam tour
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News