సోష‌ల్ మీడియాపై ష‌ర్మిల ఫైర్‌.. రీజ‌నిదే!

admin
Published by Admin — September 23, 2026 in Andhra
News Image

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల‌.. సోష‌ల్ మీడియాపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న గురించి లేనిపోనిక‌ట్టు క‌థ‌లు అల్లుతున్నార‌ని.. ఇవి పూర్తిగా నిరాధార‌మ‌ని ఆమె స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్న‌ట్టుగా చేస్తున్న ప్ర‌చారంలో వీస‌మెత్తు కూడా.. నిజం లేద‌న్నారు. తాను కుటుంబ స‌భ్యుల‌ను క‌ల‌వడం.. కామనేన‌ని చెప్పారు. ఇటీవ‌ల తాను జ‌గ‌న్‌ను క‌లిసి.. త‌న కుమార్తె అంజ‌లి వివాహ వేడుక‌కు మాత్ర‌మే ఆహ్వానించాన‌ని దీనిలో ఎలాంటి రాజ‌కీయాలు లేవ‌న్నారు.

త‌న వ్య‌క్తిత్వాన్ని భంగ ప‌రిచేలా చేస్తున్న వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తున్న‌ట్టు ష‌ర్మిల పేర్కొన్నారు. విశ్లేష‌ణ‌లు చేసే వారు నిజానిజాలు తెలుసుకుని చేయాల‌ని ఆమె సూచించారు. ప్ర‌తివిష‌యాన్నీ రాజ‌కీయం చేయ‌డం అలావాటుగా మారి పోయింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న ఇంట జ‌రుగుతున్న రెండో శుభకార్యానికి అన్ని పార్టీల అధినేత‌ల‌ను ఆహ్వానిస్తున్నాన‌ని పేర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్‌ను కూడా క‌లిసాన‌ని చెప్పారు. త‌న‌కుమారుడి వివాహ ప‌త్రిక‌ను ఇచ్చేందుకు వెళ్లిన త‌ర్వాత‌.. మ‌ళ్లీ తాను ఇప్పుడే జ‌గ‌న్ ఇంటికి వెళ్లాన‌ని చెప్పారు.

రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా త‌నకు తెలిసిన‌, ప‌రిచ‌యం ఉన్న అన్ని పార్టీల నాయ‌కుల‌ను కూడా అంజ‌లి వివాహ వేడుక‌కు ఆహ్వానిస్తున్న‌ట్టు ష‌ర్మిల‌పేర్కొన్నారు. దీనిని రాజ‌కీయ కోణంలో చూడాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. కాగా.. ఇటీవల అంజ‌లి వివాహ వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకుని ష‌ర్మిల‌.. ప‌లువురు నాయ‌కుల‌ను క‌లుసుకుని శుభ‌లేఖ‌లు అందిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్‌ను కూడా ఆమె క‌లుసుకున్నారు.

అయితే.. ష‌ర్మిల జ‌గ‌న్‌తో భేటీ అయిన త‌ర్వాత‌.. రాజ‌కీయంగా ఈ విష‌యంపై విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి. ఆమె తిరిగి వైసీపీ గూటికి చేరుతున్నార‌ని.. కీల‌క ప‌ద‌విని ఇస్తున్నార‌ని కొంద‌రు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేశారు. దీనిపై పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు కూడా జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ష‌ర్మిల తాజాగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. వివ‌ర‌ణ కూడా ఇచ్చారు. 

Tags
Ys sharmila angry on social media amid rumours
Recent Comments
Leave a Comment

Related News