బాల‌య్య ఈజ్ బ్యాక్‌.. డిసెంబ‌ర్ నుంచి ఆట షురూ.!

admin
Published by Admin — September 20, 2026 in Movies
News Image

నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నుంచి మరో మాస్ అండ్ పవర్ అప్‌డేట్ వచ్చేసింది. టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ కాంబినేషన్‌గా రూపుదిద్దుకుంటున్న 'NBK112' ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధమైంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల షూటింగ్‌లో గాయపడటం, ఆ తర్వాత సర్జరీ జరగడంతో గత కొద్ది రోజుల నుంచి విశ్రాంతి తీసుకున్న బాలయ్య, పూర్తిగా కోలుకుని తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధమయ్యారు.

ఈ సినిమాకు సంబంధించి డిసెంబర్ మొదటి వారం నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం చిత్ర యూనిట్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ముఖ్యంగా ఫస్ట్ షెడ్యూల్‌లో ప్లాన్ చేసిన హై-ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం ఓ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్‌లోనే బాలయ్య(Balayya) సరికొత్త మేకోవర్‌తో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన లుక్ , స్టైల్ ఈ చిత్రానికి ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయి.

కేవలం యాక్షన్ ఎంటర్‌టైనర్‌గానే కాకుండా, ఇందులో బలమైన కుటుంబ భావోద్వేగాలతో పాటు ప్రస్తుత రాజకీయ నేపథ్యాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించబోతున్నారట. 'దేవర' వంటి భారీ విజయం తర్వాత కొరటాల శివ ఈ కథపై ప్రత్యేకంగా కసరత్తు చేసి, మరింత పకడ్బందీగా స్క్రిప్ట్‌ను తీర్చిదిద్దారు. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ (SVC) బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా సుమారు రూ. 150 నుంచి రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సరికొత్త కథాంశంతో, మాస్ అండ్ పొలిటికల్ టచ్‌తో రాబోతున్న ఈ సినిమాను 2027 వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి బాలయ్య బాబు - కొరటాల శివ(Koratala Shiva) కాంబో బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Tags
Nandamuri Balakrishna Tollywood NBK NBK 112 Koratala Shiva Telugu Cinema Balayya
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News