మెగాస్టార్ చిరంజీవి-బాబీ కొల్లి కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద అంచనాలు పీక్స్‌కి వెళ్తాయి. గతంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సంచలన విజయం సాధించడంతో, ఈసారి రాబోతున్న `కాకా`(KAAKA) చిత్రంపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాలో తన క్యారెక్టర్ గురించి స్వయంగా మెగాస్టారే కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టడం మెగా ఫ్యాన్స్‌లో జోష్ నింపుతోంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో చిరంజీవి(Chiranjeevi) చాలా పవర్ఫుల్ అండ్ డిఫరెంట్ రోల్లో అలరించబోతున్నారు. ఒక వైపు ఆక్వా ఫ్యాక్టరీలో సాధారణ సూపర్వైజర్గా ‘సత్యం’ అనే సామాన్యుడిలా కనిపిస్తూనే.. మరోవైపు అండర్ వరల్డ్‌ను గడగడలాడించే ‘కదిరి కాళిదాస్’ అనే భయంకరమైన డాన్‌గా ఆయన ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు విభిన్న పార్శ్వాలు ఉన్న పాత్రల మధ్య నడిచే కాన్ఫ్లిక్ట్ సినిమాకే మెయిన్ హైలైట్ కానుందని టాక్.
కేవలం యాక్షన్ ఎపిసోడ్స్‌కే పరిమితం కాకుండా, ఇందులో బలమైన హార్ట్ టచింగ్ సెంటిమెంట్ కూడా ఉందట. తండ్రి, కూతుళ్ల మధ్య నడిచే ఎమోషనల్ బాండింగ్ ప్రేక్షకులను కంటతడి పెట్టించడం ఖాయమని చెబుతున్నారు. ఇందులో చిరు(Chiru) గారాలపట్టి ‘అమ్ములు’గా మలయాళీ టాలెంటెడ్ బ్యూటీ అనశ్వరా రాజన్ మెడికల్ స్టూడెంట్‌గా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ సీన్స్ థియేటర్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను అత్యంత భారీ వ్యయంతో ప్రొడ్యూస్ చేస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో చిరంజీవికి జోడిగా స్నేహ(Sneha) అలరించనుందని టాక్.