50 ఏళ్లుగా ఆ రూల్.. మోదీ ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా.?

admin
Published by Admin — September 17, 2026 in Politics, National
News Image

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) పుట్టినరోజు నేడు. ఈ ప్రత్యేక రోజున ఆయన 76వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ వయసులోనూ ఏమాత్రం అలసట లేకుండా, సుదీర్ఘ పని గంటలతో నిత్యం ఉత్సాహంగా ఉండటం చూసి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. మరి ఈ అంతులేని ఎనర్జీ, యువతను తలపించే ఫిట్‌నెస్ వెనుక దాగున్న అసలు రహస్యం ఏంటో తెలుసా?

ఖరీదైన డైట్‌లు, విదేశీ ఫ్యాషన్ ఫుడ్స్ మోదీ(Modi)దరిచేరవు. ఆయన ఆరోగ్య రహస్యం పూర్తిగా మన భారతీయ సంప్రదాయ వంటకాల్లో, నిరాడంబరమైన జీవనశైలిలో ఇమిడి ఉంది. ప్యాకేజ్డ్ లేదా ప్రాసెస్ చేసిన ఆహారానికి ఎప్పుడూ దూరంగా ఉండే ఆయన.. రోజూ ఇంట్లో వండిన తాజా భోజనాన్నే ఇష్టపడతారు. రోటీ, కూర, పప్పు, అన్నం, పోహా వంటి సాదాసీదా వంటకాలే ఆయన ప్లేట్‌లో కనిపిస్తాయి. ముఖ్యంగా పోషకాల గని అయిన మునగాకుతో చేసిన పరాఠాలను ఆయన ఎంతో ఇష్టంగా తింటారట.

ఆహార విషయంలో ఎంత సింపుల్‌గా ఉంటారో, ఉపవాసాల(Fasting) విషయంలో మాత్రం మోదీ అంతకంటే కఠినమైన నియమాలు పాటిస్తారు. దాదాపు 50 ఏళ్లుగా ఈ దీక్షలను ఆయన ఆచరిస్తున్నారు. చాతుర్మాస దీక్ష సమయంలో 24 గంటల్లో కేవలం ఒక్కసారే భోజనం చేయడం, నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు ఎలాంటి ఘన ఆహారం తీసుకోకుండా కేవలం వేడినీళ్లతో గడపడం ఆయన ఆత్మనిగ్రహానికి నిదర్శనం. ఇక చైత్ర నవరాత్రుల్లో అయితే ఆ తొమ్మిది రోజులూ ఒకే రకమైన పండును (ఉదాహరణకు బొప్పాయి) మాత్రమే ఆహారంగా తీసుకుంటూ విభిన్నమైన నియమం పాటిస్తారు.

శారీరక దారుఢ్యం కోసం జిమ్‌ల చుట్టూ తిరగకుండా, మన సంప్రదాయాన్ని గౌరవిస్తూ, స్థానిక ఉత్పత్తులకు పెద్దపీట వేయడమే ఆయన ఫిట్‌నెస్ సీక్రెట్(Fitness Secret). ఆధ్యాత్మిక విశ్వాసాలతో కూడిన కఠిన ఉపవాసాలు, క్రమశిక్షణతో కూడిన దినచర్యే నేటికీ మోదీని శారీరకంగా, మానసికంగా అత్యంత శక్తివంతంగా ఉంచుతున్నాయి.

Tags
PM Modi Narendra Modi Modi Birthday HBD Modi Modi At 76 Modi Fitness Secret BJP
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News