జ‌న‌సేన‌లో జోష్‌.. నాగబాబుకు కేబినెట్ హోదా..!

admin
Published by Admin — September 10, 2026 in Politics, Andhra
News Image

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయంలో జనసేన శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. పార్టీ సీనియర్ నేత, శాసనమండలి సభ్యుడు కొణిదెల నాగబాబుకు కేబినెట్ హోదా దక్కడంతో జనసేన శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. పర్యావరణ, అటవీ శాఖ పరిధిలోని ప్రతిష్టాత్మక ‘ఏపీ-గ్రీన్’ (AP-GREEN) ఎగ్జిక్యూటివ్‌ కమిటీ చైర్మన్‌గా ఆయనను రెండేళ్ల కాలానికి నియమిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం... తాజాగా ఆయనకు కేబినెట్ ర్యాంక్‌తో పాటు తగిన వేతన, భత్యాలను ఖరారు చేస్తూ అధికారిక జీవో విడుదల చేసింది.

ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్‌తో సాధారణ పరిపాలన శాఖ (GAD) ద్వారా వెలువడిన ఈ ఉత్తర్వుల ప్రకారం... నాగబాబు(Nagababu) బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచే కేబినెట్ స్థాయి సౌకర్యాలు, హోదా అమల్లోకి రానున్నాయి. కూటమి ప్రభుత్వంలో పార్టీ కీలక నేతకు తగిన గుర్తింపు లభించడంతో జనసేన క్యాడర్‌లో భారీగా జోష్ పెరిగింది.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా భావిస్తున్న ‘వికసిత్ ఆంధ్రప్రదేశ్-2047’ విజన్‌లో భాగంగా ఏపీ(AP) వ్యాప్తంగా 50 శాతం పచ్చదనం సాధించడమే ధ్యేయంగా ఈ కమిటీ ముందుకు సాగనుంది. హరితాంధ్ర ప్రదేశ్‌ లక్ష్య సాధన కోసం వివిధ ప్రభుత్వ శాఖలను సమన్వయం చేయడం, జిల్లాల వారీగా మొక్కల పెంపకం, అటవీకరణ కార్యక్రమాలను పర్యవేక్షించే పూర్తి బాధ్యతలను నాగబాబు భుజానకెత్తుకోనున్నారు. నాగబాబు నాయకత్వంలో ఏపీ-గ్రీన్ కమిటీ కార్యకలాపాలు మరింత వేగవంతం కానున్నాయి.

Tags
Nagababu AP Govt Janasena Ap Politics Andhra Pradesh AP News Pawan Kalyan AP Green Cabiner Rank
Recent Comments
Leave a Comment

Related News