జగన్ సొంతూరుకు అదిరిపోయే గిఫ్ట్‌.. దటీస్ ప‌వ‌న్‌.!

admin
Published by Admin — August 27, 2026 in Politics, Andhra
News Image

రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ, కక్ష సాధింపు ధోరణులతో ప్రత్యర్థులను దెబ్బతీయాలని చూసే రాజకీయ సంస్కృతికి, ప్రజా సంక్షేమమే పరమావధిగా భావించే నాయకత్వానికి మధ్య ఉండే తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంటుంది. సరిగ్గా ఇదే కోవలో ఏపీ(AP) ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రత్యర్థులు తనను రాజకీయంగా మట్టబెట్టాలని చూసినా, అదేవీ పట్టించుకోకుండా తన పనితనం ద్వారా పవన్ ఇస్తున్న రిప్లై చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

గత ఎన్నికల సమయంలో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)ను ఓడించడమే లక్ష్యంగా వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డింది. కాపు సామాజికవర్గంలో బలమైన నేతలను రంగంలోకి దంపడం, జగన్ అత్యంత సన్నిహితుల ద్వారా వ్యూహాలు రచించడం, చివరికి ఓడిపోకపోతే తన పేరు మార్చుకుంటానని సవాళ్లు విసరడం వంటి అనేక నాటకీయ పరిణామాలు అక్కడ చోటుచేసుకున్నాయి. అయితే, పిఠాపురం ప్రజలు మాత్రం ఎలాంటి ప్రలోభాలకు, కుల రాజకీయాలకు తలవంచకుండా పవన్ కళ్యాణ్‌ను అఖండ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపారు. అంతేకాదు, రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా అత్యున్నత బాధ్యతలు అప్పగించారు.

ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న అధికార శక్తిని, తన నియోజకవర్గానికే పరిమితం చేయకుండా నేరుగా వైఎస్ కుటుంబ కంచుకోట అయిన పులివెందుల అభివృద్ధికి కేటాయించడం విశేషం. దశాబ్దాలుగా ఏలినాటి శనిలా వెంటాడుతున్న పులివెందుల(Pulivendula) తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు 'జల్ జీవన్ మిషన్ – అమరజీవి జలధార' కింద సుమారు 280 కోట్ల రూపాయల భారీ నిధులను కేటాయించారు. గత ప్రభుత్వ హయాంలో అటకెక్కిన ఈ ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం పునర్జీవం పోయడంతో పులివెందుల ప్రజలకు దశాబ్దాల తాగునీటి కష్టాలు తీరబోతున్నాయి.

ఎన్నికల సమయంలో తనను ఓడించడానికి ప్రయత్నించిన నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న, లేదా ప్రత్యర్థి పార్టీకి అత్యంత ప్రధానమైన నియోజకవర్గం అని చూడకుండా... ప్రజల మౌలిక అవసరాలే ముఖ్యమనే పవన్ ఉదార స్వభావం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. "రాజకీయాలు ఎన్నికల వరకే, ఆ తర్వాత ప్రజా సంక్షేమమే ముఖ్యం" అని పవన్ మరోసారి నిరూపించారు. నాడు పిఠాపురంలో ఓటమిని కోరుకున్న జగన్‌(Jagan)కు, నేడు పులివెందుల ప్రజల గొంతు తడిపే నీటి రూపంలో పవన్ ఇస్తున్న ఈ రిటర్న్ గిఫ్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పవన్ మార్క్ పాలిటిక్స్ అంటే ఇదేనంటూ జనసైనికులు, అభిమానులు ఈ పరిణామాన్ని తెగ ట్రెండ్ చేస్తున్నారు.

Tags
Pawan Kalyan Pulivendula Andhra Pradesh JanaSena YSRCP AP Politics Jal Jeevan Mission Pithapuram AP News
Recent Comments
Leave a Comment

Related News