స్టార్ యూట్యూబర్‌కు షాక్‌.. కండక్ట‌ర్‌తో భార్య జంప్‌.!

admin
Published by Admin — August 12, 2026 in Movies
News Image

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వార్త వైరల్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. నవ్వులు పంచే కంటెంట్‌తో మిలియన్ల మంది అభిమానులను సంపాదించుకున్న మలయాళ ప్రముఖ యూట్యూబర్, నటుడు అఖిల్ ఎన్ఆర్‌డీ(Akhil NRD) జీవితంలో ఇప్పుడు ఊహించని విషాదం చోటుచేసుకుంది. ఎంతో అన్యోన్యంగా ఉంటారనే పేరు తెచ్చుకున్న ఈ దంపతుల కాపురంలో అనూహ్య పరిణామాలు సంచలనం సృష్టిస్తున్నాయి. అఖిల్‌ భార్య మేఘ.. అర్ధరాత్రి పూట ఇంటి నుంచి పరారవ్వడం, అది కూడా ఒక సాధారణ బస్సు కండక్టర్‌తో వెళ్లిపోవడం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

చదువుకునే రోజుల్లోనే అఖిల్‌, మేఘ(Megha) మ‌ధ్య‌ మొదలైన పరిచయం కాలక్రమేణా గాఢమైన ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల అంగీకారంతో 2024 నవంబర్‌లో వీరు ఘనంగా వివాహం చేసుకున్నారు. లా పూర్తి చేసిన మేఘను.. భర్త అఖిల్ ప్రోత్సాహంతోనే సోషల్ మీడియా ప్రపంచానికి పరిచయం అయింది. ఇద్దరూ కలిసి చేసిన వ్లాగ్స్, కామెడీ రీల్స్ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలా భర్త నీడలో ఎదిగిన మేఘ, కొద్దికాలంలోనే సొంతంగా ఫ్యాషన్, బ్యూటీ పేజీని రన్ చేస్తూ భారీ ఫాలోయింగ్‌ను కైవసం చేసుకుంది.

అయితే, పెళ్లయ్యాక కూడా ఉన్నత చదువులు చదవాలన్న మేఘ కోరికను అఖిల్((Akhil) మన్నించాడు. ఆమెను ఒక కోర్సులో చేర్పించగా, ఆ కాలేజీ ప్రయాణమే వారి జీవితాలను పూర్తిగా మార్చివేసింది. నిత్యం బస్సులో ప్రయాణించే మేఘకు.. అక్కడ డ్యూటీలో ఉన్న ఒక లోకల్ బస్సు కండక్టర్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా క్షణికావేశంలో ప్రేమగా మారి, పెడదోవ పట్టించింది. భర్తను, సంసారాన్ని కాదనుకుని ఆ కండక్టర్‌తో కలిసి వెళ్లిపోవాలని ఆమె నిర్ణయించుకుంది. ఇల్లు విడిచి వెళ్లే సమయంలో ఇంట్లోని విలువైన నగలు, నగదును కూడా ఆమె వెంట తీసుకెళ్లినట్లు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మొదట భార్య కనిపించకపోవడంతో కంగారుపడిన అఖిల్, పోలీసులను ఆశ్రయించి మిస్సింగ్ ఫిర్యాదు చేశాడు. కానీ, పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసిన సీసీటీవీ ఫుటేజ్ చూసి ఆయన గుండె పగిలింది. రాత్రి వేళ నైటీ ధరించి, చేతిలో సూట్‌కేస్ పట్టుకుని పరుగుపరుగున బయటకు వస్తున్న మేఘ.. అక్కడ బైక్‌పై సిద్ధంగా ఉన్న ఆ కండక్టర్(Conductor) వెనుక కూర్చుని వెళ్లిపోవడం ఆ దృశ్యాల్లో స్పష్టంగా రికార్డైంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అఖిల్ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.

మరోవైపు, ఈ వివాదంపై దుమారం రేగుతున్న తరుణంలో మేఘ సోషల్ మీడియా వేదికగా స్పందించే ప్రయత్నం చేసింది. అఖిల్ ప్రవర్తన సరిగ్గా లేదని, ఇతర యువతులతో సంబంధాలు పెట్టుకుని తనను మానసికంగా వేధించాడని, అందుకే ఇల్లు వదలాల్సి వచ్చిందని ఆమె ఒక క్లారిటీ వీడియోను పోస్ట్ చేసి వెంటనే డిలీట్ చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా, యూట్యూబ్ స్టార్స్(Youtube Stars) కావ‌డంతో నెట్టింట అఖిల్‌, మేఘ వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా మారింది.

Tags
Akhil NRD Akhil NRD Wife Megha Bus Conductor Malayalam YouTuber Kerala Viral News
Recent Comments
Leave a Comment

Related News

Latest News