టాలీవుడ్(Tollywood)లో మరో స్టార్ వారసుడి ఎంట్రీకి రంగం సిద్ధమవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా గుసగుసలు వినిపిస్తున్నాయి. వివాదాలు, డైలాగ్‌లతో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఇంట త్వరలోనే ఓ అఫీషియల్ లాంచ్ ఉండబోతుందనే చర్చ సాగుతోంది.
ఈనెల 15న జరగనున్న బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుకకు సంబంధించిన సంగీత్ ఈవెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వేదికపై బండ్ల గణేష్ పెద్ద కుమారుడు హితేష్ బండ్ల(Hitesh Bandla) వేసిన అదిరిపోయే స్టెప్పులు అందరినీ ఆశ్చర్యపరిచాయి. టాలీవుడ్ స్టార్ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్ సూపర్ హిట్ సాంగ్స్‌కు హితేష్ లయబద్ధంగా చేసిన డాన్స్ మూమెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అంతేకాదు, కొడుకును అలా స్టేజ్ మీద చూడాలనే తన చిరకాల కోరిక నెరవేరిందంటూ బండ్ల గణేష్(Bandla Ganesh) తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పటివరకు మీడియా కంట పడకుండా, లైమ్‌లైట్‌కి దూరంగా ఉన్న హితేష్.. సడన్‌గా ఈ రేంజ్‌లో కనిపించడంతో పాటు పర్సనాలిటీపరంగానూ అచ్చం హీరో మెటీరియల్లా కనిపిస్తుండటం విశేషం.
ఇప్పటికే పరమేశ్వర ఆర్ట్స్(Parameswara Arts) బ్యానర్‌పై రీ-ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేయడానికి బండ్ల గణేష్ సన్నాహాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కుమారుడిని హీరోగా పరిచయం చేసేందుకు ఈ వెడ్డింగ్ ఈవెంట్‌ను ఆయన ఒక పర్‌ఫెక్ట్ లాంచ్‌ప్యాడ్‌లా వాడుకున్నారనే టాక్ వినిపిస్తోంది. తండ్రి బ్యాగ్రౌండ్, మంచి హైట్ అండ్ పర్సనాలిటీ ఉన్న హితేష్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తే చూడాలని ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి బండ్ల గణేష్ మనసులో ఏముంది? తన తనయుడిని త్వరలోనే సిల్వర్ స్క్రీన్‌పై హీరోగా పరిచయం చేయబోతున్నారా లేదా అనే దానిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
https://x.com/idlebrainjeevi/status/2086553633408327705?s=20