వైసీపీ గూండాలకు లోకేశ్ వార్నింగ్

admin
Published by Admin — August 01, 2026 in Andhra
News Image

``వైసీపీ గూండాలపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటాం. విధుల్లో ఉన్న మ‌హిలా ఎస్సై ప్ర‌వ‌ల్లిక‌పై వైసీపీ గూం డాలు చేసిన దాడిని రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌లు ప‌రిశీలించారు. వారిని అస‌హ్యించుకుంటున్నారు. ఇలాంటి వారికి త‌గిన శిక్ష‌లు ప‌డాలి. క‌ఠినంగా శిక్షించేలా అధికారుల‌ను ఆదేశిస్తాం`` అని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. వైసీపీకి మ‌హిళ‌లంటే అత్యంత చుల‌క‌న అని.. మ‌హిళ‌ల‌ను రోడ్డుకు ఈడ్చ‌డం.. వారిని వేధించడం వెన్న‌తో పెట్టిన విద్య అని ఆక్షేపించారు.  ఈ సంద‌ర్భంగా వైసీపీ అధినేత జ‌గ‌న్ .. త‌న త‌ల్లి, చెల్లిని ఇంటి నుంచి త‌రిమేశారంటూ.. లోకేష్ వ్యాఖ్యా నించారు.

``అన్నం పెట్టాల్సి వ‌స్తుంద‌ని అమ్మ‌ని.. ఆస్తిలో వాటా అడుగుతుంద‌ని చెల్లిని ఇంటి నుంచి గెంటేసిన జ‌గ‌న్‌కు మ‌హిళ‌లంటే విలువ‌లేదు. ఇలాంటి వారికి రాష్ట్రంలోనూ చోటు లేదు`` అని తీవ్ర వ్యా ఖ్యలు చేశారు. రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం మ‌హిళ‌ల‌కు స‌మున్న‌త స్థానం ఇస్తోంద‌ని తెలిపారు. మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌కు ప్రాధాన్యం ఇస్తోంద‌న్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌ల‌ను చూస్తూఊరుకునేది లేద‌ని స్ప‌ష్టం చేశారు.  ఏం జ‌రిగింది?  వైసీపీ అధినేత జ‌గ‌న్ గురువారం శ్రీకాకుళం జిల్లాలో ప‌ర్య‌టించారు.

పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు జైల్లో ఉండ‌డంతో ఆయ‌న‌ను ప‌రామ‌ర్శించేందుకు అంపోలు జైలుకు వెళ్లారు. అయి తే.. విమానాశ్ర‌యం నుంచి సుమారు 162 కిలో మీట‌ర్ల మేర‌కు ఆయ‌న యాత్ర‌గా వెళ్ల‌డంతో వైసీపీ కార్య‌క‌ర్త లు వేలాదిగా త‌ర‌లి వ‌చ్చి..  ర‌హ‌దారుల‌పై హంగామా సృష్టించారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్ల‌ను ఏర్పాటు చేశారు.  

వాటిని కూడా తోసుకుంటూ వెళ్లిపోతున్న స‌మ‌యంలో విధుల్లో ఉన్న మ‌హిళా ఎస్సై ప్ర‌వ‌ల్లిక‌తో వైసీపీ కార్య‌క‌ర్త‌లు, ముఖ్యంగా ఆముదాల‌వ‌ల‌స నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్ వాగ్వాదానికి దిగారు. ఈ స‌మ‌యంలో ఆమెను చుట్టుముట్టి తోసేసేశారు. దీంతో ఆమె బిత్త‌ర‌పోయారు. త‌న‌ను తాను ర‌క్షించుకుంటూ.. పక్క‌కు త‌ప్పుకొన్నారు. ఈ ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. దీనిపైనే మంత్రి లోకేష్ తీవ్రంగా స్పందించారు. వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు.

Tags
jagan ycp tdp minister lokesh ycp goons warning
Recent Comments
Leave a Comment

Related News