బాల‌య్య డేరింగ్ డెసిష‌న్‌.. ఆగ‌స్టు 1 నుంచి..?

admin
Published by Admin — July 30, 2026 in Movies
News Image

సినిమా రంగంలో నందమూరి బాలకృష్ణ(Balakrishna) డెడికేషన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వయసుతో సంబంధం లేకుండా ప్రతి సినిమా కోసం ఆయన పడే కష్టం, చూపించే ఉత్సాహం కుర్ర హీరోలకు సైతం స్పూర్తిని ఇస్తుంటాయి. తాజాగా ఆయన కెరీర్‌లోని 110వ, 111వ ప్రాజెక్ట్‌ల విషయంలో బాలయ్య తీసుకున్న ఒక సాహసోపేత నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

గోపీచంద్ మలినేని(Gopichand Malineni) దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'NBK111' షూటింగ్ సమయంలో బాలయ్య ఊహించని విధంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం తర్వాత ఆయనకు చిన్నపాటి సర్జరీ కూడా జరిగింది. సాధారణంగా ఇలాంటి గాయాలు తగిలితే నటీనటులు కనీసం కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకుంటారు. కానీ, బాలయ్య బాబు మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఆలోచించారు. అభిమానుల అంచనాలను అందుకోవడానికి, అనుకున్న టైమ్‌కు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేకప్ వేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం, గాయం నుంచి పూర్తిగా కోలుకోకముందే సెట్స్‌లోకి అడుగుపెట్టాలని బాలయ్య డేరింగ్ డెసిషన్ తీసుకున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆగస్టు 1 నుంచే ఆయన మళ్లీ షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి విరామాలు లేకుండా నాన్‌స్టాప్‌గా షెడ్యూళ్లు పూర్తి చేసి, ఈ ఏడాది చివరి నాటికి NBK111 టోటల్ టాకీ పార్ట్‌ను కంప్లీట్ చేయాలనే పక్కా ప్లాన్‌తో చిత్ర యూనిట్ ముందుకు వెళ్తోంది.

మరోవైపు డిసెంబర్ 30 రిలీజ్ డేట్‌పై ఓటీటీ పార్ట్‌నర్‌తో పాటు మేకర్స్ తాజాగా చర్చిస్తున్నట్లు సమాచారం. అనుకున్న తేదీకి సినిమాను థియేటర్లలోకి తెచ్చేలా బాలయ్య తీసుకున్న ఈ సాహస నిర్ణయం చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సర్జరీ తర్వాత కూడా బాలయ్య(Balayya) బాబు తగ్గేదేలే అంటూ చూపిస్తున్న తెగువ సోషల్ మీడియాలో ఇప్పుడు సెన్సేషన్ సృష్టిస్తోంది.

Tags
NBK111 Nandamuri Balakrishna Balayya Gopichand Malineni Tollywood Telugu Cinema
Recent Comments
Leave a Comment

Related News