వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన తనయుడు ఆరవ్ ను యాక్సిడెంట్ కేసు నుంచి తప్పించేందకు అప్పల రాజు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. విచారణను తప్పుదోవ పట్టించేలా ఆయన ప్రయత్నం చేశారని అప్పలరాజు పై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. కొద్దిరోజుల క్రితం అప్పలరాజు తనయుడు ఆరవ్ బైక్ నడుపుతూ గొర్రెల కాపరి దానయ్యను బైక్ తో ఢీకొట్టడంతో దానయ్య మృతి చెందాడు.
అయితే ఈ కేసు నుంచి ఆరవ్ ను తప్పించేందుకు అప్పలరాజు ప్రయత్నించారు. బైక్ నడుపుతున్నది తన కొడుకు కాదని, అతని స్నేహితుడు అని పోలీసులను తప్పుదోవ పట్టించారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా ప్రమాదానికి కారణమైన బైక్ ను కూడా అప్పలరాజు మార్చేందుకు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. దాంతోపాటు బాధిత కుటుంబానికి డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టేందుకు అప్పలరాజు ప్రయత్నించారని ఆరోపణలు రావడంతో ఆయనపై కేసు నమోదయింది. ఈ క్రమంలోనే ఈ రోజు కాశీబుగ్గ లో అప్పలరాజు నివాసానికి వెళ్లి పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అయితే, అప్పలరాజు అరెస్టు సమయంలో వైసీపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.