తండ్రైన టాలీవుడ్ హీరో.. నారా వారింట సంబ‌రాలు..!

admin
Published by Admin — June 23, 2026 in Movies
News Image

టాలీవుడ్‌(Tollywood)లో విలక్షణమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న హీరో నారా రోహిత్ ఇంట ఆనంద‌క‌ర క్ష‌ణాలు నెల‌కొన్నాయి.  ఆయన భార్య శిరీష(Sirisha) తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ క్రేజీ అప్‌డేట్ బయటకు రావడంతో నారా కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. పెళ్లయిన కొద్ది నెలలకే తమ లైఫ్‌లోకి లిటిల్ ప్రిన్స్ ఎంట్రీ ఇవ్వడంతో ఈ కొత్త దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి.

గతేడాది అక్టోబర్‌లో వైభవంగా జరిగిన నిశ్చితార్థం, ఆ తర్వాత టాలీవుడ్ స్టార్స్‌తో పాటు రాజకీయ దిగ్గజాల సమక్షంలో జరిగిన వీరి పెళ్లి వేడుక ఎంతటి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. అప్పటినుంచి ఈ బ్యూటిఫుల్ కపుల్ ఎప్పుడు సోషల్ మీడియాలో కనిపించినా ఫ్యాన్స్ మురిసిపోయేవారు. లైఫ్‌లో కొత్త చాప్టర్ స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే తండ్రిగా ప్రమోషన్ సాధించి, నారా రోహిత్(Nara Rohit) తన సంతోషాన్ని డబుల్ చేసుకున్నారు.

ఇక ఒకవైపు పర్సనల్ లైఫ్‌లో ఇంతటి మధురమైన క్షణాలను ఎంజాయ్ చేస్తున్న నారా రోహిత్, మరోవైపు ప్రొఫెషనల్ గానూ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్ర‌స్తుతం విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఆదర్శ కుటుంబం(Adarsha Kutumbam)’లో నారా రోహిత్ నటిస్తున్న కీలక పాత్రపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ దసరా రేసులో థియేటర్లలో సందడి చేయబోతున్న ఈ సినిమాతో పాటు, సోలో హీరోగా కూడా ఆయన మరో విభిన్నమైన లైనప్‌ను సెట్ చేసుకుంటున్నారు.

Tags
Nara Rohit Sirisha Lella Tollywood News Nara Family Telugu Cinema
Recent Comments
Leave a Comment

Related News