దేశానికి, రాష్ట్రాలకు సమర్థవంతమైన నాయకులు ఉంటే.. అభివృద్ధి పరుగులు పెడుతుందని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. దేశానికి నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నంత వరకు వెనుదిరిగి చూసుకోవా ల్సిన అవసరం లేదన్నారు. అలానే.. ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రిగా.. సమర్థవంతమైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన ఏపీలో సాధించిన ప్రగతిని ఆయన వివరించా రు. పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తున్న లోకేష్.. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహించి న ప్లీనరీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ``ఏపీలో పెట్టుబడులకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. వీటిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి`` అని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తోందని.. అనుమతులు సైతం వేగంగా మంజూరు చేస్తోందని తెలిపారు. సింగిల్ విండో విధానం అనేది ఒకప్పటి మాట అని.. ప్రస్తుతం ఎలాంటి విండోలు లేవని.. నేరుగా పనులు చేయించడమేనని చెప్పారు.
గూగుల్ డేటా కేంద్రంతోపాటు క్వాంటం కంప్యూటింగ్, ఆర్సెల్లార్ మిట్టల్, రాయల్ ఎన్ ఫీల్డ్ వంటి ప్రతిష్టా త్మక సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టాయన్నారు. కావాల్సినంత మానవవనరులు సిద్ధంగాఉన్నాయని తెలిపారు. నీరు, విద్యుత్‌వంటి సౌకర్యాలను కూడా వెంటనే అందిస్తున్నామన్నారు. భూములు ఇచ్చేందు కు ఏపీ రైతులు ఎప్పుడూ ముందుంటున్నారని.. అమరావతి రాజధానికి 33వేల ఎకరాలు ఇచ్చి.. తమ దాతృత్వాన్ని చాటుకున్నారని తెలిపారు.
రాష్ట్రంలో 23 లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు వచ్చాయని.. ఈ ఏడాదిలోనే అన్నీ గ్రౌండ్ అయ్యేలా చూస్తున్నామని చెప్పారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనకు.. రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. స్వర్ణాంధ్ర విజన్@2047 లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ బుల్లెట్ సర్కారు దూసుకుపోతోందన్నారు. ప్రభుత్వం పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవని.. తమ ప్రభుత్వానికి ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉందని తెలిపారు. చంద్రబాబు, మోడీల నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకుసాగుతోందని వివరించారు.