జ‌న‌సేన `జాతీయ వాదం`.. చ‌రిత్ర సృష్టించ‌నుందా?!

admin
Published by Admin — June 15, 2026 in Politics
News Image
జ‌నసేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌న పార్టీని కేవ‌లం ఏపీకి మాత్ర‌మే ప‌రిమితం చేయ‌కుండా.. తెలంగాణ‌స‌హా ఇత‌ర రాష్ట్రాల‌కు కూడా విస్త‌రించే ప‌నిలో ఉన్నార‌న్న‌ది రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతున్న చ‌ర్చ‌. తెలంగాణ విష‌యంలో ఆయ‌న ఓపెన్ కామెంట్స్ చేస్తున్నారు. తాము తెలంగాణ‌లో విస్త‌రిస్తామ‌ని.. ఎన్నిక‌ల్లో పోటీ చేస్తామ‌ని కూడా చెబుతున్నారు. ఇక్క‌డితోనే జ‌న‌సేన ప‌ని అయిపోలేదు. అస‌లు సిస‌లు వ్యూహాత్మ‌క రాజ‌కీయం ఇప్పుడే ప్రారంభ‌మైంది.
 
దేశం అంతా ఒక్క‌టేన‌ని.. ఇటీవల ఢిల్లీలో ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్ క‌ల్యాణ్ జాతీయ వాదం వినిపించారు. అంద‌రూ ఒక్క‌టేన‌న్నారు. దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు.. గ‌తంలో స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్‌.. ప్ర‌స్తుత ప్ర‌ధాని మోడీ కూడా ప్ర‌య‌త్నిస్తున్నార‌ని చెప్పారు. దీనిలో భాగంగానే `విక‌సిత్ భార‌త్‌` నినాదాన్ని వినిపిస్తున్నార‌ని చెప్పారు. ముఖ్య‌మంత్రులే.. ప్రాంతీయ వాదం వినిపించ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. త‌ద్వారా.. జాతీయ వాదం వినిపించాల‌న్న‌ది ప‌వ‌న్ ఆలోచ‌న‌.
 
 ఆ త‌ర్వాత‌.. తిరుప‌తిలో జ‌రిగిన ఏపీ కూట‌మి ప్ర‌భుత్వ‌ విజ‌యోత్స‌వ స‌భ‌లో కూడా.. ప‌వ‌న్ ఇదే మాట వినిపించారు. ``ప్ర‌జ‌లు ఐక్యంగా లేక‌పోతే.. ప్రాంతీయ‌, కుల వాద‌న‌లు పెరుగుతాయి`` అని వ్యాఖ్యానించా రు. సో.. మొత్తంగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. జాతీయ‌వాదం నినాదాన్ని పుణికి పుచ్చుకున్న‌ట్టే క‌నిపిస్తోంది. దీనిని హైలెట్ చేయ‌డం ద్వారా.. ఆయ‌న జాతీయ స్థాయి రాజ‌కీయ ముఖ చిత్రాన్నిప‌వ‌న్ మార్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. నిజానికి ఇటీవ‌ల కాక్రోచ్ జ‌న‌తా పార్టీ కూడా.. `జాతీయ వాదం` మాట‌ను ప్ర‌స్తావించింది. ప్ర‌జ‌లంతా ఏక‌మ‌వ్వాల‌ని.. వ్యాఖ్యానించింది.
 
దీంతో కేవ‌లం కొన్ని రోజుల వ్య‌వ‌ధిలోనే కాక్రోచ్ జ‌నతాపార్టీకి కోట్ల మంది ఫాలోవ‌ర్లు వ‌చ్చాయి. ఇలా.. ఇ ప్పుడు జ‌న‌సేన అధినేత కూడా జాతీయ వాదాన్ని బ‌లంగా వినిపించింది.. భార‌తీయులంతా ఒక్క‌టేన‌ని.. ప్రాంతీయ వాదం అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మ‌ని చెప్ప‌డం ద్వారా.. ఆయ‌న ప్ర‌స్తుత త‌రానికి `స‌రికొత్త రాజకీ య వేదిక‌`ను సృష్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇది స‌క్సెస్ అయితే.. నిజంగానే... దేశ‌రాజ‌కీయాల్లో చ‌రి త్ర సృష్టించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.
 
స‌మ‌స్య‌లు-స‌వాళ్లు:
 
జాతీయ‌వాదం వినిపించిన వారు చాలా మందే ఉన్నారు. అయితే.. ఇది తెర‌మీదికి వ‌చ్చినప్పుడల్లా.. మ‌త ప‌ర‌మైన విభేదాలు.. స‌మ‌స్య‌లు కూడా వ‌స్తున్నాయి. వీటిని ప‌రిష్క‌రించేందుకు జ‌న‌సేన ప్ర‌య‌త్నం చేయాలి. ముస్లిం డామినేటెడ్ రాజ‌కీయాలు పెరుగుతున్న‌(త‌మిళ‌నాడు, కేర‌ళ‌లో ఐయూఎంఎల్ అధికారం పంచుకుంది) నేప‌థ్యంలో జాతీయ వాదం బ‌లం పెంచేందుకు ఎంతో కృషి చేయాలి. అన్నివ‌ర్గాల‌ను స‌మీకరించేందుకు.. కుల మ‌త ప్రాంత విభేదాల‌ను త‌గ్గించేందుకు ఇప్పుడున్న శ‌క్తి స‌రిపోతుందో లేదో స‌రిచూసుకోవాలి.
 
అంతిమంగా..
 
జాతీయ వాదం అనే విధానానికి దేశం ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇటీవ‌ల ప్ర‌ధాని చెప్పిన‌ట్టు.. ప్ర‌జ‌లు ఐక్యంగా ఉండేందుకు.. అనేక సంద‌ర్భాల్లో ప్ర‌య‌త్నించారు. లాక్ డౌన్ నుంచి బంగారం కొనుగోలు నిలిపివేత వ‌ర‌కు.. ప్ర‌జ‌లు జాతీయ వాదానికి బ‌లాన్ని స‌మ‌కూర్చారు. అయితే.. దీనిని ముందుకు న‌డిపించే శ‌క్తిమంత‌మైన నాయ‌కుడి అవ‌స‌రం ఉంది. ఈ రూపంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ముందు వ‌స్తే.. ఆయ‌న‌పై ద‌క్షిణాది ముద్ర ప‌డ‌కుండా చూసుకుంటే.. జ‌గ‌జ్జేత‌గా మార‌డం క‌నుచూపు మేర‌లోనే ఉంద‌ని చెప్పుకోవ‌చ్చు.
Tags
janasena national level national integrity creating history
Recent Comments
Leave a Comment

Related News