రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి.. జూన్ 12వ తేదీకి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నారు. ఈ రెం డేళ్ల కాలంలో ప్రభుత్వం ప్రజలను మెప్పించిందా? మురిపించిందా? అంటే.. అనుకూల వర్గాలు సహ జంగానే ఔనని అంటాయి. వ్యతిరేక వర్గాలు పెదవి విరుస్తాయి. ఈ నేపథ్యంలో నేరుగా జనాల అభిప్రాయా లను తెలుసుకునే ప్రయత్నంచేశాయి ఆన్‌లైన్ మాధ్యమాలు. ఈ క్రమంలో సంక్షేమంపై ప్రజలు సాను కూలంగానే ఉన్నారు. అయితే.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవినీతి పెచ్చరిల్లుతోందన్న ఆవేదన వ్యక్తమవుతోంది.
సూపర్ సిక్స్..
సూపర్ సిక్స్ పథకాలను సంపూర్ణంగా అమలు చేశామని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. అయితే.. వీటి అమలు తీరు సరిగా లేదన్నది క్షేత్రస్థాయిలో వినిపిస్తున్న మాట. ఒక్క సామాజికభద్రతా పింఛను విష యాన్ని పక్కన పెడితే.. మిగిలిన సూపర్ సిక్స్ పథకాలు సరైన సమయానికి అందడం లేదని అంటున్నా రు. పైగా..లబ్ధిదారుల సంఖ్యను `కొందరు` కుదిస్తున్నారని గ్రామాల్లో చర్చ సాగుతోంది. వీటిపై ప్రభుత్వం ఆలోచన చేయాల్సి ఉంది.
ఎవరికి వారే..
ప్రజలకు-ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండే.. అధికారులు, ప్రజాప్రతినిధుల పనితీరు పెద్దగా మార్కు లు పొందలేక పోయింది. ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మంత్రులుచెప్పినా వినని అధికా రుల పేర్లు తరచుగా వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇక, ఎమ్మెల్యేలు, కలెక్టర్లకు మధ్య దూరం కూడా పెరుగుతోంది. ఈ విధానంతో క్షేత్రస్థాయిలో పొలిటికల్ గవర్నెన్స్‌పై ప్రభావం పడుతోంది. అయితే.. కలెక్టర్లు మాత్రం తాము నిబంధనల మేరకు పనిచేస్తున్నామని చెబుతున్నారు. దీంతో ప్రజలకు సరైన సౌకర్యాల కల్పన, పథకాల అమలు ఇబ్బందిగా మారాయన్నది వాస్తవం.
ఉద్యాగాలపై ఉవ్విళ్లు..
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఉద్యోగాల కల్పన విషయంలో మాత్రం సంతృప్తి వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా.. ఎప్పటికప్పుడు ప్రకటనలు చేయడం.. భర్తీ నోటిఫికేషన్లకు తాజాగా జాబ్ క్యాలెండర్‌జారీ చేయడం వంటివి సర్కారుకు మంచి మార్కులుపడేలా చేసింది. ముఖ్యంగా డీఎస్సీ సహా పోలీసు రిక్రూట్‌మెంటు కూడా బాగుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. పెట్టుబడుల ద్వారా.. ఉద్యోగాల కల్పన జరుగుతుందని విశ్వసిస్తున్నవారు.. 99 శాతం మందిఉండడం సర్కారు పనితీరుకు నిదర్శనం.
పనిచేస్తున్న అభివృద్ధి మంత్రం..
అభివృద్ధిమంత్రం పఠిస్తున్న చంద్రబాబుకు ప్రజల్లో భారీగా సానుకూలత పెరుగుతోంది. పెట్టుబడులు తీసుకువస్తూ.. మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నారని మెజారిటీ ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. అయితే.. అమరావతి విషయంలో కొంత తటస్థ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. భారీ స్థాయిలో అప్పులు చేసి కడుతున్నారన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా.. ఈ రెండేళ్ల కాలంలో 72 శాతం మేరకు సానుకూలత వ్యక్తంకాగా.. 20 శాతం మేరకు వ్యతిరేకత కనిపిస్తోంది. 8 శాతం మందితటస్థంగా ఉన్నారు.