ఆ మ‌హిళా మంత్రికి ఫ్యామిలీ సెగ..!

admin
Published by Admin — June 13, 2026 in Politics, Andhra
News Image

రాష్ట్రంలో ముగ్గురు మ‌హిళా మంత్రులు ఉన్నారు. వీరిలో మ‌న్యం(Manyam) జిల్లాకు చెందిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. ప్ర‌స్తుతం గిరిజ‌న సంక్షేమ శాఖ‌మంత్రిగా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా సాలూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన త‌ర్వాత‌.. ఆమెకు చంద్ర‌బాబు మంచి అవ‌కాశం ఇచ్చారు. ఈ శాఖ ప‌రిధిలో చేసేందుకు చాలానే ఉంది. స‌మ‌స్య‌లు కూడా అలానే ఉన్నాయి. మంత్రిగా సంధ్యారాణి ప‌నితీరుతో మంచి మార్కులు వేయించుకునే స్కోపు కూడా ఉంది.

మ‌రి ఆమె ఆ దిశ‌గా అడుగులు వేస్తున్నారా?  రెండేళ్ల‌లో ఆమె మంత్రిగా ఏం సాధించారు?  ఆమెకు ఎదురవుతున్న స‌మ‌స్య‌లు ఏంటి? అనేది ఆస‌క్తిక‌రం. పాల‌న ప‌రంగా మంత్రిగా.. సంధ్యారాణి(Sandhyarani) స్పంద‌న బాగానే ఉంది. గిరిజ‌న స‌మ‌స్య‌లు తెలిసిన నాయ‌కురాలిగా ఆమె స్పందిస్తున్నారు. గిరిజ‌న హాస్ట‌ళ్ల‌ను ప‌రిశీలిస్తున్నారు. స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే.. కేంద్రం నుంచి వ‌స్తున్న గిరిజ‌న బ‌డ్జెట్ విష‌యంలో ఆమె వెనుక‌బ‌డుతున్నారు.

వాస్త‌వానికి గిరిజ‌న సంక్షేమ శాఖ‌కు  రాష్ట్ర ప్ర‌భుత్వం బ‌డ్జెట్ నిధుల‌ను స్వ‌ల్పంగానే కేటా యిస్తుంది. అది ఏప్ర‌భుత్వం ఉన్నా.. అలానే జ‌రుగుతుంది. దీంతో సాధార‌ణంగా కేంద్ర బ‌డ్జెట్ నుంచి కేటాయించే రాష్ట్ర నిధుల‌ను విరివిగా వాడుకునే ప్ర‌య‌త్నం చేయాలి. ఇటీవ‌ల డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌(Deputy CM Pawan Kalyan).. విశాఖ జిల్లాలోని ఓ మ‌న్యం ప్రాంతంలో రోడ్లువేయించారు. విద్యుత్ కూడా ఇప్పించారు. దీనికి కేంద్రం నుంచి వ‌చ్చిన నిధుల‌నే వినియోగించారు.

ఇలా.. చేసేందుకు మంత్రి సంధ్యారాణికి అవ‌కాశం ఉంది. కానీ.. ఆమె ఈ త‌ర‌హాలో ఆలోచ‌న చేయ‌డం లేదు. దీంతో నిధుల కొర‌త‌తో గిరిజ‌న సంక్షేమం వెనుక‌బ‌డ‌తోంది. మ‌రోవైపు.. కుటుంబ రాజ‌కీయాలు పెరుగుతున్నాయి. ఆమె ఫ్యామిలీ చేస్తున్న ప‌నుల‌ కార‌ణంగా.. ఇబ్బందుల్లో ప‌డుతున్నార‌న్న‌ది వాస్త‌వ‌మ ని పార్టీ నాయ‌కులే చెబుతున్నారు. ప‌నితీరు విష‌యంలో సంధ్యారాణికి చంద్ర‌బాబు(Chandrababu) వ‌ద్ద ప‌డుతున్న మార్కులు 50 లోపే ఉండ‌డానికి ఇదేకార‌ణ‌మ‌ని అంటున్నారు. ఈ విష‌యంలో ఆమె స‌రిచేసుకోవాలి.

Tags
AP Politics Gummidi Sandhyarani Chandrababu Naidu AP Government Andhra Pradesh Manyam District Saluru
Recent Comments
Leave a Comment

Related News