ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan)ను ఉద్దేశించి.. కాపు సామాజిక వర్గం నాయకులు రాజమండ్రిలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. ఈ సమావేశానికి వచ్చిన వారిలో సీనియర్ కాపు నేతలు లేకపోవడం.. ముఖ్యంగా వైసీపీకే చెందిన ముద్రగడ పద్మనాభం రాకపోవడం.. అలానే.. ఇతర ముఖ్య నేతలు కూడా కనిపించకపోవడంతో ఈ ప్రెస్‌మీట్ సహా.. పవన్ పై చేసిన వ్యాఖ్యలు.. వారు మాట్లాడారా? లేక ఎవరైనా మాట్లాడించారా? అనే సందేహాలు పొలిటికల్ సర్కిళ్లలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
కాపుల ఆత్మగౌరవ సమావేశం పేరుతో కాపు రిజర్వేషన్ పోరాట సమితి(రాష్ట్రంలో ఎవరికీ పెద్దగా తెలియదు. పైగా ఎప్పుడు ఏర్పడిందో కూడా సందేహమే.) నాయకులు రాజమండ్రి(Rajahmundry)లో సభ పెట్టారు. ఈ సంద ర్భంగా కాపుల అభ్యున్నతి, రిజర్వేషన్.. లేదా కాపులకు జరుగుతున్న లోటుపాట్ల గురించి.. వారు ప్రస్తావి స్తారని అందరూ అనుకున్నారు. కానీ, వారుకాపుల గురించి మాట్లాడింది పావలా అయితే.. డిప్యూటీ సీఎం పవన్‌పై దుమ్మెత్తి పోసింది ముప్పావలా.. అన్నట్టుగా సమావేశం సాగింది.
ఆద్యంతం నాయకులు పవన్(Pawan)ను విమర్శించేందుకు.. ఆయనను తప్పుబట్టేందుకు.. ఆయన విధానాలను .. చర్యలను మరో కీలక సామాజిక వర్గంతో ముడిపెట్టి మాట్లాడేందుకు మాత్రమే నాయకులు పరిమితం అయ్యారు. ఒకానొకదశలో పవన్‌ను ఏకవచనంతో కూడా సంబోధించారు. దీంతో అసలు ఈ సమావేశం ఉద్దేశం ఏంటి? ఎందుకు? ఎవరు చేశారు? అనేది ఆసక్తిగా మారింది. నిజానికి కాపులకు సమస్యలు లేవని ఎవరూ అనరు. ఉన్నాయి. కానీ.. వాటి పేరుతో పవన్‌ను ఏకేయడం అంటే.. దీని వెనుక వేరే శక్తులు ఉన్నాయని రాజకీయ వర్గాల్లోనే చర్చ సాగుతోంది.
మరీ ముఖ్యంగా కాపుల ఉద్యమం అనగానే.. లేదా కాపుల సమావేశం అనగానే.. దానిపై ముద్రగడ ముద్ర పడుతుంది. అలానే తూర్పు గోదావరి(West Godavari)కి చెందినకీలకకాపులు కూడా వస్తారు. కానీ, ఈ సమావేశంలో కీ నాయకులు కానీ, కీలక నాయకులు కానీ కనిపించకపోవడం గమనార్హం. దీనికితోడు.. పవన్‌పైనిప్పులు చెరగడం చూస్తే.. ఇది వేరే శక్తుల పనేనని అంటున్నారు. వాస్తవానికి ఈ సమావేశానికి మంచి ఉద్దేశమే ఉండి ఉంటే.. పవన్‌కుసూచనలు చేయొచ్చు.. సలహాలు ఇవ్వొచ్చు. ఆయన వింటారా వినరా? అనేదిపక్కన పెట్టి.. తమ సూచనలు చేసేందుకు అవకాశం ఉంది. కానీ, ఇది అలా జరగలేదు. దీంతోనే ఈ సమావేశంలో కాపులు.. మాట్లాడారా? లేక వారితో ఎవరైనా మాట్లాడించారా? అనేది ఆసక్తిగా మారింది.