టాలీవుడ్ సీనియర్ హీరో, విక్టరీ వెంకటేష్(Venkatesh) ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొని బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటిన వెంకీ మామ.. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆదర్శ కుటుంబం’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఒక నయా అప్‌డేట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో జోరుగా చక్కర్లు కొడుతోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. నిజానికి ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా విడుదల చేయాలని భావించినప్పటికీ, కుదరలేదు. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. టాలీవుడ్(Tollywood)లో మోస్ట్ సెంటిమెంట్ సీజన్ అయిన విజయదశమిని టార్గెట్ చేశారు మేకర్స్. అక్టోబర్ 16న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్. దసరా సెలవుల అడ్వాంటేజ్ పూర్తిగా వాడుకోవాలనేది చిత్ర యూనిట్ మాస్టర్ ప్లాన్‌గా కనిపిస్తోంది.
ఇక ఈ సినిమాలో వెంకటేష్ సరసన ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ లాంటి క్లాసిక్ హిట్స్ తర్వాత త్రివిక్రమ్-వెంకీ కాంబోలో వస్తున్న ఈ మూవీలో కేవలం నవ్వులు, కుటుంబ భావోద్వేగాలే కాకుండా.. ఊహించని స్థాయిలో హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఉండబోతున్నట్లు సమాచారం. వెంకీ మామను సరికొత్తగా, మునుపెన్నడూ చూడని రీతిలో ప్రెజెంట్ చేస్తున్నారట త్రివిక్రమ్. మరి ఈ క్రేజీ కలయికలో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’(Aadarsha Kutumbam) బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.