జనసేనకు మరో 2 రాజ్యసభ స్థానాలు

admin
Published by Admin — June 06, 2026 in Politics
News Image
ఆంధ్ర ప్రదేశ్ నుంచి ప్రస్తుతం నాలుగు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇందుకు సంబం ధించి స్థానాల కేటాయింపుపై ఎన్డీయే సమన్వయ సమావేశంలో నిర్ణయమైంది. ఒక స్థానం జనసేనకు కేటా యించారు. ఈ స్థానానికి లింగమనేని రమేష్ ను పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. అయితే, జనసేనకు 2029లోపు మరో 2 రాజ్యసభ స్థానాలు కూడా దక్కనున్నాయి.
 
2024 సార్వత్రిక ఎన్నికల సమయంలోనే కూటమి పార్టీల మధ్య రాజ్య‌స‌భ‌ స్థానాలపై చర్చ జరిగింది. అప్పటి ఎన్నికల్లో సర్దుబాటులో భాగంగా జనసేన తాను పోటీ చేయవలసిన లోక్ సభ స్థానాలను త్యాగం చేసింది. లోక్ సభ స్థానాలు త్యాగం చేసిన క్రమంలో రాజ్య సభలో స్థానాలు కల్పించేలా చర్చ జరిగింది. ఇందుకు సంబంధించిన అవగాహనలో భాగంగా 2024-29 మధ్య ఆంధ్ర ప్రదేశ్ నుంచి వచ్చే రాజ్యసభ స్థానాలలో మూడు జనసేనకు కేటాయించేలా నిర్ణయించారు.
 
ఈ క్ర‌మంలో తాజాగా చంద్ర‌బాబు నేతృత్వంలో గురువారం జ‌రిగిన ఎన్డీయే స‌మావేశంలో ఒక‌ రాజ్యసభ స్థానం జ‌న‌సేన‌కు కేటాయించారు. వ‌చ్చే 2029 నాటికి మ‌రో రెండు స్థానాల‌ను కూడా జ‌న‌సేన‌కు ఇవ్వ‌ను న్నారు. కాగా, 2014లో పార్టీ ఆవిర్భ‌వించిన త‌ర్వాత‌.. గ‌త 2024 ఎన్నిక‌ల్లో లోక్‌స‌భ‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఇద్ద‌రు జ‌న‌సేన నాయ‌కులు విజ‌యం ద‌క్కించుకున్నారు. దీంతో లోక్‌స‌భ‌కు మ‌చిలీప‌ట్నం నుంచి వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరి, కాకినాడ పార్ల‌మెంటు స్థానం నుంచి తంగెళ్ల ఉద‌య్ శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
 
కానీ, రాజ్య‌స‌భ‌కు మాత్రం అవ‌కాశం చిక్క‌లేదు. ఈ క్ర‌మంలో తాజాగా ఒక సీటు కేటాయింపుతో రాజ్య‌స‌భ లోనూ.. జ‌న‌సేన గ‌ళం వినిపించ‌నుంది.ఇది ఒక‌ర‌కంగా.. జ‌న‌సేన‌కు మంచి బూస్ట్ ఇచ్చే ప‌రిణామం. పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లోనూ జ‌న‌సేన‌కు ఇప్పుడు ప్రాతి నిధ్యం ల‌భించ‌నుంది. పార్టీ పెట్టిన పుష్క‌ర కాలం త‌ర్వాత‌.. రాజ్య‌స‌భ‌లో జ‌న‌సేన పార్టీ నేత క‌నిపించ నున్నారు. త‌ద్వారా.. జాతీయ రాజ‌కీయాల్లో జ‌న‌సేన ప్ర‌భావం పెర‌గ‌నుంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.
Tags
janasena rajyasabha seats two more
Recent Comments
Leave a Comment

Related News