బహుభాషా నటుడు ప్రకాష్‌రాజ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. గతంలో రాజకీయాలు కూడా చేసిన ఆయన.. సమస్య ఏదైనా తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా ఎక్కడ ఏం జరిగినా.. ఆయన రియాక్షన్ కోసం అభిమానులు కూడా ఎదురు చూస్తుంటారు. భావప్రకటనా స్వేచ్ఛపై గతంలో పెద్ద ఎత్తున గళం వినిపించిన ప్రకాష్ రాజ్ ఇదే పరంపరలో.. తెలంగాణ వర్సెస్ పవన్ కల్యాణ్ విషయంపైనా స్పందించారు.
అయితే.. ఈ స్పందించే తీరుతోనే కాస్త వ్యంగ్యం.. కొన్ని చెణుకులు జోడించే సరికి.. అది కాస్తా తీవ్ర విమ ర్శలకు దారితీసింది. వాస్తవానికి పవన్‌కు-ప్రకాష్ రాజ్‌కు మధ్య వివాదాలు ఉన్నాయని అంటారు. రాజకీయంగా పవన్‌ను అనేక సందర్భాల్లో పీఆర్ వ్యతిరేకించారు కూడా. సనాతన ధర్మ దీక్ష చేసినప్పుడు కూడా.. తీవ్రంగా విమర్శించారు. ఇక.. తాజాగా తెలంగాణలో పార్టీని విస్తరిస్తామని.. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తామని, సమస్యలపై గళం వినిపిస్తామని పవన్ చెప్పారు.
దీనికి కౌంటర్‌గా స్పందించిన ప్రకాష్‌రాజ్.. ``రండి దొరా.. మీరు వస్తామంటే మేం కాదంటామా..`` అని వ్యంగ్యం జోడించి వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ``గుంపుగా వస్తున్నారా.. ఒంటరిగా వస్తున్నారా?`` అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు వ్యంగ్యమేనని తెలిసిందే. దీనిపై తాజాగా సినీ నిర్మాత బండ్ల గణేష్ స్పందిం చారు. అయితే.. ప్రకాష్‌రాజ్ మాదిరిగా ఆయన వ్యంగ్యంగా కాదు.. ఒకింత సీరియస్‌గానే ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.
``నీకెందుకురా ప్రతి దాంట్లో వేలుపెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి? ప్రతి ఊర్లో, ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్‌లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్‌వా లేక దేశ ప్రధాని వా? ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే. నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయ్!`` అని బండ్ల కౌంటర్ ఇచ్చారు.