గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కిన హై-వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ థియేటర్లలో దండయాత్రకు సిద్ధమైంది. జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్ కోసం మెగా అభిమానులతో పాటు సినిమా ఇండస్ట్రీ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్‌కు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు రేవంత్ రెడ్డి(Revanth Reddy) సర్కార్ అధికారికంగా అనుమతులు మంజూరు చేసింది.
ప్రభుత్వం విడుదల చేసిన తాజా జీవో ప్రకారం.. ‘పెద్ది(Peddi)’ సినిమా విడుదలకు ముందు రోజు రాత్రి, అంటే జూన్ 3వ తేదీనే ప్రత్యేక ప్రీమియర్ షోలు వేసుకునేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మోస్ట్ అవేటెడ్ ప్రీమియర్ షోల కోసం టికెట్ ధరను గరిష్టంగా రూ. 600 గా నిర్ణయించారు. రామ్ చరణ్‌ను వెండితెరపై ఒక రోజు ముందే చూడాలనుకునే డైహార్డ్ ఫ్యాన్స్‌కు ఇది నిజంగా క్రేజీ అప్‌డేట్ అని చెప్పాలి.
ఇక రెగ్యులర్ రిలీజ్ విషయానికి వస్తే.. సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. సాధారణ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రస్తుతం ఉన్న ధరలపై అదనంగా రూ.100, అలాగే మల్టీప్లెక్స్ థియేటర్లలో ప్రతి టికెట్‌పై అదనంగా రూ.125 వరకు పెంచుకోవచ్చు. సినిమా విడుదలైన రోజు నుంచి మొదటి 10 రోజుల పాటు (జూన్ 13 వరకు) ఈ పెంచిన ధరలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం(Telangana Govt) తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రంలో రామ్ చరణ్(Ram Charan) సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు.