క్రేజ్ అంటే రష్మికదే.. సంపాదనలో న‌యా రికార్డ్!

admin
Published by Admin — June 02, 2026 in Movies
News Image

చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఉంటేనే సెలబ్రిటీల రేంజ్ మారుతుంది. ముఖ్యంగా హీరోయిన్ల కెరీర్ గ్రాఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. కానీ, ‘నేషనల్ క్రష్’ రష్మిక మందన్న(Rashmika Mandanna) మాత్రం ఇందుకు పూర్తి మినహాయింపు అని నిరూపిస్తోంది. కేవలం ఐదేళ్ల వ్యవధిలోనే ఆమె తన మార్కెట్ వాల్యూను ఏకంగా ఏడు రెట్లు పెంచుకుని సౌత్ టు నార్త్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఒకప్పుడు కేవలం రూ. 2 కోట్ల పారితోషికంతో సరిపెట్టుకున్న రష్మిక(Rashmika), ఇప్పుడు ఏకంగా రూ. 15 కోట్ల క్లబ్‌లో చేరి టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. ‘పుష్ప-1’ సినిమా క్రియేట్ చేసిన సంచలనంతో ఈ క్రేజీ బ్యూటీ రేట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత వచ్చిన ‘సీతారామం’, ‘వారిసు’ సినిమాలతో తన క్రేజ్‌ను కాపాడుకుంటూ, బాలీవుడ్‌లో ‘గుడ్‌బై’, ‘మిషన్ మజ్ను’ చిత్రాలతో అక్కడ కూడా పాగా వేసింది.

రష్మిక కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రాల్లో ‘యానిమల్(Animal)’ చాలా కీలకమైంది. రణబీర్ కపూర్ సరసన గీతాంజలిగా ఆమె పండించిన నటనకు నార్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడంతో, రష్మిక డిమాండ్ ఒక్కసారిగా స్కై రాకెట్‌లా దూసుకెళ్లింది. ‘పుష్ప 2’ కోసం రూ. 7 కోట్లకు పైగా అందుకున్నట్లు టాక్ రాగా, ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.

ప్రస్తుతం షాహీద్ కపూర్, కృతి సనన్‌లతో కలిసి నటిస్తున్న ‘కాక్‌టెయిల్ 2(Cocktail 2)’ సినిమా కోసం రష్మిక ఏకంగా రూ. 15 కోట్ల భారీ మొత్తాన్ని డిమాండ్ చేసి, సైన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఒక హీరోయిన్ ఐదేళ్ల షార్ట్ పీరియడ్‌లోనే 2 కోట్ల నుంచి 15 కోట్ల స్థాయికి ఎదగడం అనేది టాలీవుడ్‌లో ఒక నయా రికార్డ్ అనే చెప్పాలి.

Tags
Rashmika Mandanna Rashmika Remuneration National Crush Pushpa 2 Animal Movie Cocktail 2
Recent Comments
Leave a Comment

Related News