జగన్ మైండ్ గేమ్.. గెలిపిస్తే ఓకే, లేదంటే ప్యాకప్!

admin
Published by Admin — May 28, 2026 in Politics, Andhra
News Image

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూటే సెపరేటు. ఆయన రాజకీయం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఊహించడం సొంత పార్టీ నేతలకే సాధ్యం కాదు. తాజాగా తాడేపల్లి(Tadepalli) ప్యాలస్‌లో జరిగిన పార్టీ సమీక్షా సమావేశంలో జగన్ మరోసారి తన మార్క్ మైండ్ గేమ్‌తో కేడర్‌కు మైండ్ బ్లాక్ చేశారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను లైట్ తీసుకుంటే కెరీర్ ప్యాకప్ అయిపోతుందనే రేంజ్‌లో ఇన్‌ఛార్జ్‌లకు గట్టి వార్నింగే ఇచ్చారు. ఒకవైపు క్లాస్ చెప్తూనే, మరోవైపు ఊహించని మాస్ యాక్షన్‌కు తెరలేపడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

నిజానికి మీటింగ్ మొదలైనప్పుడు జగన్ చాలా కూల్‌గా, ఒక పర్‌ఫెక్ట్ లీడర్‌లా మాట్లాడారు. క్షేత్రస్థాయిలో అభ్యర్థులకు ఎమ్మెల్యేలతో సహా సీనియర్లంతా అండగా నిలవాలని హితబోధ చేశారు. "ఇప్పుడు మీరు కిందస్థాయి నేతలను గెలిపిస్తే.. రేపు అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్లే మీకు సైన్యంలా మారి మిమ్మల్ని గెలిపిస్తారు" అంటూ ఒక అద్భుతమైన పొలిటికల్ లాజిక్ చెప్పారు. ఇక్కడివరకు అంతా బాగానే ఉంది, జగనన్న(YS Jagan) భలే రూట్ మ్యాప్ ఇచ్చారంటూ నేతలంతా సంబరపడిపోయే లోపే అసలు ట్విస్ట్ ఇచ్చారు.

ఆ ట్విస్టే ఏకగ్రీవాల పంచాయితీ! ఎక్కడైనా కూటమి నేతల ఒత్తిడికి లొంగి ఏకగ్రీవాలు జరిగితే అస్సలు సహించేది లేదని, దానికి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లదే బాధ్యతని కరాఖండిగా తేల్చేశారు. అవసరమైతే కఠిన చర్యలు ఉంటాయని భయపెట్టారు. అయితే ఇక్కడే ఒక విచిత్రమైన పరిస్థితి తలెత్తింది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో ఏకగ్రీవాలు జరిగితే.. అవన్నీ తమ సంక్షేమ పాలన చూసి జనం ఏకగ్రీవంగా ఇచ్చిన తీర్పులంటూ అప్పట్లో వైసీపీ నేతలు చంకలు గుద్దుకున్నారు.

నాడు జనం తీర్పు అని మురిసిపోయిన నోటితోనే.. నేడు ఏకగ్రీవాలైతే యాక్షన్ ఉంటుంది, సీట్లు ఖాళీ చేయిస్తాం అనడం డబుల్ స్టాండర్డ్స్ కాదా అనే చర్చ మొదలైంది. అప్పుడు రైట్ అయిన విషయం ఇప్పుడు రాంగ్ ఎలా అవుతుందనే ప్రశ్నలు వస్తున్నాయి. ఏదేమైనా, తాడేపల్లి బాస్ పెట్టిన ఈ కొత్త రూల్‌తో వైసీపీ(YCP) ఇన్‌ఛార్జ్‌ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గెలిపిస్తే లీడర్లుగా ప్రమోషన్ దక్కుతుంది సరే.. కానీ ఏకగ్రీవాల పేరిట తేడా వస్తే మాత్రం ప్యాకప్ అవ్వక తప్పదనే సంకేతాలు పంపడంలో జగన్ సక్సెస్ అయ్యారు.

Tags
YS Jagan Mohan Reddy Tadepalli Meeting YSRCP Local Body Elections AP Politics AP News Andhra Pradesh
Recent Comments
Leave a Comment

Related News