చంద్రబాబు ఫోకస్ చేస్తే వైసీపీ విలవిల

admin
Published by Admin — May 23, 2026 in Andhra
News Image
టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగ‌న్ చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో రాజ‌కీయ వ‌ర్గాల్లో ముఖ్యంగా టీడీపీ వ‌ర్గాల్లోఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు చంద్ర‌బాబు కేరాఫ్ అని.. త‌న కుటుంబంలోని ముగ్గ‌రు మ‌ర‌ణానికి ఆయ‌నే కార‌ణ‌మన్న రీతిలో జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. వాస్త‌వానికి ఇదే నిజ‌మ‌ని జ‌గ‌న్ భావించి ఉంటే.. తాను అధికారంలో ఉన్న ఐదేళ్ల‌లో ఏం చేశార‌న్న‌ది టీడీపీ నేత‌లు సంధిస్తున్న ప్ర‌శ్న‌. ఇప్పుడు ఓడిపోయి.. గ‌తాన్ని గుర్తు చేసుకుంటున్నారా? అని ఎద్దేవా చేస్తున్నారు.
 
ఇక‌, మ‌రో కీల‌క అంశం.. చంద్ర‌బాబు ఫ్యాక్ష‌న్ రాజకీయాల గురించి జ‌గ‌న్ ప్ర‌స్తావించారు. కానీ, ఫ్యాక్ష‌న్ ప‌క్క‌న పెడితే.. వైసీపీ హ‌యాంలో ఆ పార్టీ నాయ‌కులు చేసిన త‌ప్పుల‌పై ప్రస్తుత‌ ప్ర‌భుత్వం కొన్ని కొన్ని విష‌యాల‌పై నే విచార‌ణ చేస్తోంద‌ని చెబుతున్నారు. ఈ కొన్నింటికే వైసీపీ నాయ‌కులు జైలుకు వెళ్తున్నార ని.. దీంతో ఆ పార్టీ ఉక్కిరి బిక్కిరికి గుర‌వుతోంద‌ని అంటున్నారు. అలా కాకుండా.. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన‌.. అన్ని అవ‌క‌త‌వ‌క‌ల‌పైనా చ‌ర్య‌లు తీసుకుంటే మ‌రింత విల‌విల్లాడ‌తార‌ని చెబుతున్నారు.
 
చంద్ర‌బాబుపై జ‌గ‌న్ చెబుతున్న వ్యాఖ్య‌లు నిజ‌మే అయితే.. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన‌.. అవ‌క‌త‌వ‌క‌ల‌ను వెలుగులోకి తీసుకువ‌చ్చి.. విచారణ‌కు ఆదేశిస్తే.. త‌ట్టుకునే శ‌క్తి కూడా.. ఆ పార్టీ నాయ‌కుల‌కు ఉండ‌ద‌ని అంటున్నారు. చంద్ర‌బాబు జోక్యం చేసుకుని ప‌ట్టు బిగిస్తే.. వైసీపీ విల‌విల‌లాడుతుంద‌ని వ్యాఖ్యానిస్తున్నా రు. కేవలం మ‌ద్యం.. అగ్రి గోల్డ్‌, కేసులు మాత్ర‌మే ప్ర‌భుత్వం ప‌ట్టించుకుంద‌నిదానికే ఆ పార్టీ నాయ‌కులు అల్లాడిపోతున్నార‌ని గుర్తు చేస్తున్నారు.
 
నిబంధ‌న‌ల మేర‌కు చంద్ర‌బాబు చ‌ర్య‌లు తీసుకుంటే.. అనేక విష‌యాలు వెలుగులోకి వ‌స్తాయ‌ని అంటు న్నారు. అంతేకాదు.. రాజ‌కీయంగా చంద్ర‌బాబు చాలా ఆలోచించి నిర్ణ‌యాలు తీసుకుంటున్న‌ట్టు చెబుతు న్నారు. ఏ మాత్రం దూకుడుగా వ్య‌వ‌హ‌రించినా.. వైసీపీకి, ఆ పార్టీ అధినేత‌కు కూడా ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అంటున్నారు. కాబ‌ట్టి.. జ‌గ‌న్ మాట్లాడే మాట‌ల‌కు.. క్షేత్ర‌స్థాయిలో ప్ర‌భుత్వం ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుకు ఎక్క‌డా పొంత‌న లేద‌ని వ్యాఖ్యానిస్తున్నారు.
Tags
cm chandrababu jagan tdp ycp focus smash
Recent Comments
Leave a Comment

Related News