బండి సంజయ్ కు చిక్కులు తప్పవా?

admin
Published by Admin — May 09, 2026 in Telangana
News Image

భాషా భేదం లేకుండా చాలా సినిమాల్లో ఒక తరహా క్యారెక్టర్లు కనిపిస్తుంటాయి. తండ్రి పెద్ద రాజకీయ నాయకుడు. మంత్రి పదవిలో కూడా ఉంటాడు. ఆ వ్యక్తికి ఒక ముద్దుల కొడుకు ఉంటాడు. అతడికి ఉండాల్సిన అవలక్షణాలన్నీ ఉంటాయి. తండ్రి సంపాదించిన డబ్బును ఖర్చు పెడుతూ.. దౌర్జన్యాలు చేస్తూ, అమ్మాయిలపై అఘాయిత్యాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో ఒక తప్పు చేసి పోలీస్ స్టేషన్‌కు వెళ్తే.. తండ్రి తన పలుకుబడిని ఉపయోగించి అతణ్ని బయటికి తీసుకొస్తుంటాడు. ఐతే సినిమాల్లో హీరోలు ఇలాంటి వాళ్లకు బుద్ధి చెబుతుంటారు కానీ.. బయట మాత్రం ఇలాంటి వాళ్లకు ఎదురుండదు. రాజకీయ పలుకుబడితో ప్రతిసారీ బయటపడిపోతుంటారు.

ఒకసారి తప్పు చేసి అన్ పాపులర్ అయ్యాక కూడా బుద్ధి తెచ్చుకోరు. మళ్లీ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఆయన తనయుడు బండి భగీరథ్‌లను చూస్తే ఇలాంటి సినిమా క్యారెక్టర్లు గుర్తుకు రాకమానవు. తెలంగాణలో బీజీపేకి ఉన్న అతి పెద్ద నాయకుల్లో ఒకరు బండి సంజయ్. సుదీర్ఘ కాలం కష్టపడి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కూడా అయ్యారు. ఆయన హయాంలో పార్టీకి మంచి ఊపు కూడా వచ్చింది. కానీ తన కొడుకు పుణ్యమా అని ఆయన అప్రతిష్టను మూటగట్టుకోవాల్సి వచ్చింది. గతంలో తన కాలేజీలో ఒక కుర్రాడిని దారుణంగా కొట్టిన వీడియో బయటికి రావడంతో భగీరథ్ పేరు సామాజిక మాధ్యమాల్లో మార్మోగింది. వేరే కొన్ని వివాదాల వల్ల కూడా అతను మరింత చెడ్డ పేరు సంపాదించాడు.

ఇది తండ్రికి చాలా ఇబ్బందికరంగా మారింది. అయినా ఆయన కొడుకును వెనకేసుకుని వచ్చాడు. అతడిలో మార్పు తీసుకురాలేకపోయాడు. అదే చేసి ఉంటే.. ఇప్పుడు ఇంకో పెద్ద కేసులో భగీరథ్ ఇరుక్కునేవాడు కాదు. ఒక మైనర్ బాలికకు మద్యం తాపి అత్యాచారం జరిపాడంటూ భగీరథ్ మీద పోక్సో కేసు నమోదైంది. పోక్సో కేసు అంటే చాలా తీవ్రమైందే. భగీరథ్ దీన్నుంచి బయటికి రావడం అంత తేలిక కాదు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ కేసును అంత తేలిగ్గా వదలకపోవచ్చు. ఈ పరిణామం బండి సంజయ్ రాజకీయ ప్రయాణానికి తీవ్ర ఇబ్బందికరంగా మారడం ఖాయం. కొన్ని రోజులుగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి నేషనల్ మీడియా బిజీగా ఉంది. ఇప్పుడే కొద్దిగా ఫ్రీ అవుతున్నారు. ఇప్పుడు గనక ఈ కేసు మీద వాళ్లు ఫోకస్ పెట్టారంటే బండి సంజయ్ మంత్రి పదవికి ఎసరు వచ్చినా ఆశ్చర్యం లేదు.

Tags
Vandi sanjay bhageerath pocso case
Recent Comments
Leave a Comment

Related News