తాజాగా వెలువుడుతున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. తమిళనాడులో హీరో విజయ్ స్థాపించిన టీవీకి ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం దూసుకుపోతోంది. 110కు పైగా స్థానాల్లో టీవీకే ఆధిక్యంలో కొనసాగుతోంది. అన్నాడీఎంకే 75 స్థానాల్లో, డీఎంకే 50 స్థానాల్లో లీడ్ లో ఉన్నాయి. సీఎం స్టాలిన్ తో .పాటు ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్ వెనుకబడ్డారు.
ఇక, పశ్చిమ బెంగాల్ లో దీదీకి ఈ సారి పాక్ తగిలేలా ఉంది. సీఎం మమతా బెనర్జీ పై ఆమె ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి భవానీపుర్, నందిగ్రామ్ రెండు స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ 170 స్థానాల్లో లీడ్ లో ఉండగా, టీఎంసీ 117 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. పలితాల సరళిని చూస్తే బెంగాల్లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడే ఛాన్స్ కనిపిస్తోంది.
ఇక, కేరళలో యూడీఎఫ్ 97 స్థానాల్లో, ఎల్డీఎఫ్. 41 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. అస్సాంలో బిజెపి హవా నడుస్తోంది. బీజేపీ 101 స్థానాల్లో లీడ్ లో ఉండగా, కాంగ్రెస్ 23 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్నార్ కాంగ్రెస్ 16 స్థానాల్లో లీడ్ లో ఉంది. కాంగ్రెస్ కి 8 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది.