కేసీఆర్‌ పాల‌న‌లో అన్నీ విధ్వంసం:  రేవంత్‌

admin
Published by Admin — April 16, 2026 in National
News Image

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి.. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌పై ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. గ‌త ప‌దేళ్ల‌లో రాష్ట్రాన్నిఅన్ని విధాలా దోచుకుతిన్నార‌ని అన్నారు. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను దుర్వినియోగం చేసి.. అన్నింటినీ ధ్వంసం చేశార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. తాము అధికారంలోకి వ‌చ్చాక‌.. ఒక్కొక్క వ్య‌వ‌స్థ‌ను స‌రిచేసుకుంటూ వ‌స్తున్నామ‌ని.. అయినా.. ప్ర‌భుత్వంపైనా వ్య‌క్తిగ‌తంగా త‌న‌పైనా విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు.

``మా వెనుక  గోతులు తీసేవారి భ‌ర‌తం మీరే ప‌ట్టాలి. వారిని ఇంతి లేవ‌కుండా బొంద పెట్టాలి.`` అని ప‌రోక్షంగా బీఆర్ ఎస్‌పై వ్యాఖ్య‌లు గుప్పించారు. తాను ముందు చూస్తాన‌ని.. ప్ర‌జ‌ల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. త‌న వెనుక గోతులు తీసేవారి అంతు చూడాల‌ని ప్ర‌జ‌ల‌ను ఆయ‌న కోరారు. రాజ్యాంగ నిర్మాత‌ అంబేడ్క‌ర్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని లోయ‌ర్ ట్యాంకు బండ్ వ‌ద్ద ఉన్న అంబేడ్క‌ర్ విగ్ర‌హానికి నివాళుల‌ర్పించారు.

ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారం అనేది సేవ కోసం వినియోగిస్తున్న‌ట్టు తెలిపారు. కానీ, గ‌త పాల‌కులు.. త‌మ సేవ కోసం..ప్ర‌జ‌ల‌ను వినియోగించుకున్నార‌ని.. ఆరోపించారు. రాష్ట్రంలో ఏ వ్య‌వ‌స్థ‌ను చూసినా.. ఆవేద‌న క‌లిగేలా ఉండేద‌న్నారు. గత‌ ప్రభుత్వం చేసిన అప్పుల‌ను , త‌ప్పుల‌ను కూడా స‌రిచేసుకుంటూ ముందుకు సాగుతున్నామ‌న్నారు. కానీ.. పేదేళ్ల‌పాటు చేసిన త‌ప్పులు.. వందేళ్ల వ‌ర‌కు ప‌ట్టి పీడించేలా ఉన్నాయంటూ బీఆర్ ఎస్‌పై నిప్పులు చెరిగారు.

ఆ బిల్లు మాదే!

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు.. కాంగ్రెస్ పార్టీ ఆలోచ‌న‌ల నుంచి పుట్టింద‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మ‌న్మోహ‌న్ సింగ్ హ‌యాంలోనే.. ఈ బిల్లును రాజ్య‌స‌భ‌లో తీసుకువ‌చ్చార ని.. ఆమోదించార‌ని తెలిపారు. కానీ, రాజ్య‌స‌భ‌కు వ‌చ్చేస‌రికి మాత్రం కొన్ని పార్టీలు వ్య‌తిరేకించ‌డంతో ఇది ఆగిపోయింద‌న్నారు. కాగా.. ఈ బిల్లును త‌న ఖాతాలో వేసుకుంటూ.. మోడీ స‌ర్కారు రాజ‌కీయం చేస్తోంద‌ని రేవంత్ ఆరోపించారు.

Tags
ex cm kcr cm revanth reddy destruction brs congress allegations
Recent Comments
Leave a Comment

Related News