బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కమిటీ రాష్ట్ర కన్వీనర్ మరియు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కలపటపు బుచ్చి రామ్ ప్రసాద్ తన పదవులను సమర్థవంతంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న రాం ప్రసాద్ ను తాజాగా మరో పదవి వరించింది. టీడీపీ రాష్ట ఉపాధ్యక్ష కమిటీలో రామ్ ప్రసాద్ చోటు దక్కించుకున్నారు. గుంటూరు వెస్ట్ టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న రామ్ ప్రసాద్ కు సముచిత గౌరవం కల్పించారు. మొత్తం 16 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన ఆ కమిటీలో రామ్ ప్రసాద్ కు స్థానం దక్కింది.
ఎన్నారై టీడీపీ నేతగా విశేష సేవలందించిన రామ్ ప్రసాద్ సీఎం చంద్రబాబుకు సన్నిహితుడిగా పేరు పొందారు. ఆ తర్వాత స్వరాష్ట్రానికి తిరిగి వచ్చి ఇక్కడ ప్రజాసేవతో పాటు బ్రాహ్మణ సామాజిక వర్గానికి సేవలందిస్తున్నారు. పార్టీ పిలుపు మేరకు పలు కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ వయసులోనూ యువనేతలకు దీటుగా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు మరో పదవి దక్కింది.