ఏపీ రాజధాని అమరావతి విషయంపై కూటమి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అమరావతిని ఆంగ్లంలో సంబోధించేప్పుడు.. అదేవిధంగా రాసేప్పుడు ఎదురవుతున్న ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని.. దీనికి సంబంధించి తాజాగా జీవోనే పాస్ చేసింది. దీని ప్రకారం.. రాజధాని `అమరావతి` పేరును ఇకపై ఆంగ్లంలో రాసేప్పుడు.. ఉచ్ఛరించేప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని.. పేర్కొంది. ప్రభుత్వం సూచించినట్టుగానే `స్పెల్లింగ్` ఉండాలని స్పష్టం చేసింది.
దీని ప్రకారం.. Amaravathi.. అనే స్పెల్లింగ్ సరికాదని.... Amaravati.. అనేది కరెక్ట్ అని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. THI స్థానంలో `TI`గా పేర్కొనాలని తెలిపింది. దీని ప్రకారమే ప్రభుత్వ కార్యక్రమాలు, జీవోలు, ఫైళ్లు, ఆదేశాలు, అధికారుల ఉత్తర్వులు.. ఇలా అన్ని విభాగాల్లోనూ ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ పరిపాలనలో రాజధాని పేరును ఒకే విధంగా పేర్కొనాలని స్పష్టం చేసింది. ఈ మార్పు తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది.
ఎందుకు?
ప్రపంచ స్థాయి నగరంగా రూపు దిద్దుకుంటున్న అమరావతి పేరును విదేశీయులు.. ప్రధాన పెట్టుబడి దారులు పలికేందుకు ఇబ్బందిగా ఉంది. వాస్తవానికి.. ప్రపంచస్థాయి ఆంగ్ల డిక్షనరీల్లో తెలుగు పదాలను రాసేప్పుడు.. THI స్థానంలో `TI`గానే పేర్కొంటారు. కానీ.. కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే `తి`ని `THI` గా పేర్కొంటున్నారు. దీనివల్ల ప్రొనౌన్సియేషన్‌తోపాటు.. ఆంగ్ల పత్రికల్లోనూ రాసేందుకు ఇబ్బంది ఎదురవుతోంది. పైగా.. ఆంగ్ల అక్షరాల సెంటిమెంటు ప్రకారం కూడా.. THI స్థానంలో `TI`గా ఉంటేనే బాగుంటుందని పలువురు సూచించారు ఈ నేపథ్యంలోనే ఈ మార్పు చేయడం గమనార్హం.