7 జిల్లాల్లో వైసీపీకి కష్టమే .. !

admin
Published by Admin — April 04, 2026 in Politics
News Image

ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏడు జిల్లాల్లో వైసీపీ(ycp)కి ఉవ్వెత్తున వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయి. ఇవి కోరితెచ్చుకున్న క‌ష్టాలేన‌ని పార్టీ నాయ‌కులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. అమ‌రావ‌తి(amaravati) రాజ‌ధాని అయితే.. దీనికి చుట్టుప‌క్క‌ల ఉన్న ఏడు ప్ర‌ధాన ఉమ్మ‌డి జిల్లాల ప్ర‌జ‌ల‌కు సానుకూలంగా ఉంటుంది. దీంతో ఇక్క‌డి వారు.. గ‌తంలో అమ‌రావ‌తి రైతుల‌కు ప‌రోక్షంగా మ‌ద్ద‌తు తెలిపారు. న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం వ‌ర‌కు పాద‌యాత్ర చేసిన‌ప్పుడు.. రైతుల‌కు హార‌తులు ఇచ్చారు.

ఆ త‌ర్వాత‌.. అమ‌రావ‌తి నుంచి సింహాచ‌లం వ‌ర‌కు చేసిన యాత్ర‌కు కూడా ఇటు ఉభ‌య గోదావ‌రి ప్ర‌జ లు జేజేలు ప‌లికారు. త‌ద్వారా వారి ఆకాంక్షను బ‌య‌ట‌కు చెప్పారు. దీనిని ప‌సిగ‌ట్ట‌డంలో జ‌గ‌న్ విఫ‌లమ య్యారు. ఇది ఎంత ప్ర‌మాద‌క‌రంగా మారిందో గ‌త ఎన్నిక‌లు వైసీపీకి తెలిసి వ‌చ్చేలా చేసింది. ఇక‌, ఇప్పుడు అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించ‌డాన్ని ఏడు జిల్లాల ప్ర‌జ‌లు కోరుకున్నారు. వాస్త‌వానికి రాష్ట్రంలో ఎక్క‌డావ్య‌తిరేక‌త రాలేదు.

ఉత్త‌రాంధ్ర నుంచి రాయ‌ల సీమ వ‌ర‌కు కూడా.. ప్ర‌జ‌లు ఎక్క‌డా అమ‌రావ‌తికి వ్య‌తిరేకంగా ఒక్క మాట కూడా అన‌లేదు. కానీ.. జ‌గ‌న్ వైఖ‌రిని మాత్రం అంద‌రూ త‌ప్పుబ‌డుతున్నారు. పైగా ఏడు జిల్లాల వాసులు అయితే.. మ‌రింత‌గా వ్య‌తిరేకిస్తున్నారు. గుంటూరు, ప్ర‌కాశం, నెల్లూరు, కృష్ణా, ప‌శ్చిమ‌, తూర్పు గోదావ‌రి వాసులు జ‌గ‌న్ చేసిన మావిగాన్‌ను స‌మ‌ర్ధించ‌లేదు. పైగా.. అమరావ‌తినే వారు కోరుకుంటున్నారు. త‌ద్వారా.. త‌మకుమేలు జ‌రుగుతుంద‌ని కూడా భావిస్తున్నారు.

ముందుగా తాను ఏదైనా నిర్ణ‌యించుకుంటే.. దానిని ప్ర‌జ‌ల కోణంలో జ‌గ‌న్ ఆలోచించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ, ఎక్క‌డిక‌క్క‌డ‌, ఎప్ప‌టిక‌ప్పుడు.. ఆయ‌న పిల్లిమొగ్గ‌లు వేస్తున్నారు. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకోలేక పోతున్నారు. తాను చేసిందే శాస‌నం అన్న‌ట్టుగా.. జ‌గ‌న్ జేజెమ్మ‌లాగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇప్పుడు కూడా మావిగ‌న్(mavigun) విష‌యంలో ఆయ‌న పెద్ద త‌ప్పు చేశార‌న్న టాక్ వినిపిస్తోంది. దాదాపు ఏడు జిల్లాల‌లో వైసీపీ తుడిచిపెట్టుకు పోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. సానుభూతి లేక‌పోగా.. జ‌గ‌న్ వైఖ‌రిపై నిప్పులు చెరుగుతున్న‌వారు పెరుగుతున్నారు. 

Tags
Jagan mavigun 7 districts ycp Tough times
Recent Comments
Leave a Comment

Related News