వైసీపీ(ycp)లో ఉన్న నాయకులు అందరూ గుడ్డిగా జగన్‌ను సమర్ధిస్తారా? ఆయన చెప్పిన ప్రతిదానికీ తలలూపుతారా? అంటే.. కానే కాదు. ఉదాహరణకు 100 మంది నాయకులు ఉంటే.. వారిలో 70 మంది మాత్రమే జగన్(jagan)ను సమర్థిస్తారు. ఆయన చెప్పినట్టు చేస్తారు. మిగిలిన 30 మంది నాయకులు ఒకింత విచక్షణ మేరకు నడుచుకుంటారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని కూడా అంచనా వేస్తారు. ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. తద్వారా.. తమను తాము అలెర్టు చేసుకుంటారు. పార్టీపరంగా.. రాజకీ యంగా కూడా సరైన దారిలో నడిచేందుకు ప్రయత్నిస్తారు.
ఇలానే.. 2024 ఎన్నికలకు ముందు చాలా మంది నాయకులు పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఎన్నికల తర్వాతా.. ఇదే పనిచేసిన వారు ఉన్నారు. జగన్ వల్లే నాశనం అయ్యామని అన్నవారు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అంతేకాదు... వైసీపీ హయాంలో జగన్ తీసుకున్న `అమరావతి నిర్ణయం`పై విభేదించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(ప్రస్తుత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే) వంటి వారు కూడా ఉన్నారు. వారంతా జగన్‌ను విభేదించి, ఆయన వాదనను విభేదించి బయటకు వచ్చిన వారే. మరి ఇప్పుడు మాటేంటి? అంటే.. ఇప్పుడు కూడా అలాంటి వారు ఉన్నారు.
సుమారు 20 నుంచి 30 శాతం జగన్ వైఖరిని విభేదించే నాయకులు ఉన్నారు. అయితే.. అన్ని విషయాల్లోనూ కాకపోయినా.. ప్రజలకు హాని కలిగించే విషయాలతోపాటు.. ఇక.. పార్టీ పరంగా పుంజుకోదని భావించే నిర్ణయాలతో విభేదించే నాయకులు కనిపిస్తున్నారు. ఇప్పుడు.. వీరంతా తమ దారి తాము చూసుకునేందుకు రెడీ అవుతున్నట్టు పార్టీలో చర్చసాగుతోంది. ``అమరావతికి చట్టబద్ధత కల్పించిన తర్వాత కూడా.. మంకుపట్టు పనికిరాదు.`` అనిఉత్తరాంధ్రకు చెందిన ఓ కీలక నాయకుడు వ్యాఖ్యానించారు. పలువురు అమరావతి విషయంలో జగన్ చేసిన ప్రతిపాదన `మావిగన్`ను వ్యతిరేకిస్తున్నారు.
``మా విధానాలు మాకే అర్ధం కావడం లేదు. కార్యకర్తలకు, ప్రజలకు ఎలా చెబుతాం. ఏం చెప్పి ఒప్పిస్తాం. ఇది సరైన విధానం కాదు. జరిగిందేదో జరిగిపోయింది. ప్రజలు ఇప్పుడు ఏమనుకుంటున్నారన్నస్పృహ మాకు అవసరం. వారి నాడిని పట్టుకోవా ల్సిన అవసరం ఉంది. మేం చెప్పినట్టు ప్రజలు వినరన్నది గత ఎన్నికల్లోనే మాకు అర్ధమైంది. కనీసం ఇప్పుడైనా ప్రజల మాట వినాలి.`` అని సీమకు చెందిన ఓ రెడ్డి నాయకుడు(మాజీ ఎమ్మెల్యేకూడా) వ్యాఖ్యానించారు. మరికొందరు నాయకులు కూడా ఇదే మాట చెబుతున్నారు. ఈ పరిణామాలతో `ఇక అనవసరం.. జగన్‌కు చెప్పినా వినడు`` అనే మాట వినిపిస్తోంది. ఫలితంగా నాయకులు తమ దారి తాము చూసుకుంటారన్న చర్చ జోరుగా సాగుతోంది.