న‌వ య‌వ్వ‌న‌ తెలుగు దేశం

admin
Published by Admin — March 28, 2026 in Politics
News Image

టీడీపీ(tdp).. ఈ పేరుకు పెద్ద‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఉమ్మ‌డిఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 1980ల‌లో సంచల‌నం సృష్టించిన రాజ‌కీయ‌ పార్టీ.తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదాన్ని గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు వినిపించిన పార్టీ. అంతేకాదు.. పేద‌ల‌కు ప‌ట్టెడు అన్నం పెట్టి.. వారి ఆక‌లి తీర్చాల‌న్న సంక‌ల్పంతో దేశంలోనే తొలిసారి రూ.2కే కిలో బియ్యాన్ని అందించిన పార్టీ కూడా.. తెలుగుదేశ‌మే. అంతేనా.. మ‌హిళ‌ల‌కు ఆస్తి హ‌క్కుతో పాటు.. వారి వైవాహిక జీవితానికి సంబంధించిన స్వేచ్ఛ‌ను క‌ల్పించే హ‌క్కుల‌కు కూడా ప్రాణం పోసింది.

ఇక‌, కేంద్రంలోనూ అధికార ప‌గ్గాలు చేప‌ట్టే నాయ‌కుల‌ను ఎంపిక చేయ‌డంలో కూడా తెలుగు దేశం పార్టీ కీల‌క భూమిక పోషించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు చేసుకుంటూ.. పాత త‌రంనుంచి న‌వ‌తారానికి మారుతూ.. త‌న‌ను తాను వినూత్నంగా ఆవిష్క‌రించుకుంటూ వ‌స్తున్న టీడీపీ.. 1982, మార్చి 29న ఆవిర్భవించింది. ఆ నాడు.. కాంగ్రెస్‌పాలిత రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలుగు నేత‌ల‌కు.. ముఖ్య మంత్రుల‌కు కూడా విలువ ద‌క్క‌ని ప‌రిస్థితి ఉండేది.

కేంద్రంలోని పెద్ద‌లు చెప్పిన‌ట్టు ఆడాల‌న్న సంస్కృతి కూడా బ‌ల‌పడింది. దీనిని తుద‌ముట్టించేందుకు.. తెలుగు వారి పౌరుషాన్ని ప్ర‌పంచానికి చాటి చెప్పేందుకు ఆవిర్భ‌వించిందే తెలుగుదేశం. ఇలా.. 1982లో ఆవిష్కృత‌మైన పార్టీ అన‌తి కాలంలోనే అనంత మైన ప్ర‌జాభిమానాన్ని సొంతంచేసుకుంది. వాస్త‌వానికి అప్ప‌టి వ‌ర‌కు ప్రాంతీయ పార్టీల‌కు పెద్ద‌గా గుర్తింపు లేదు. త‌మిళ‌నాడులో ఎంజీఆర్ ప్ర‌భావం ఉన్న‌ప్ప టికీ.. ఒడిశాలో బిజు ప‌ట్నాయ‌క్ ప్ర‌స్థానం ఉన్న‌ప్ప‌టికీ..  జాతీయ‌స్థాయిలో గ‌ళం వినిపించిన ప్రాంతీయ పార్టీ ఒక్క తెలుగుదేశ‌మేన‌ని చెప్పాలి.

ఇక‌, ఆ త‌ర్వాత‌.. నిరంత‌రం.. త‌రం.. త‌న‌ను తాను తీర్చిదిద్దుకుంటూ తెలుగు దేశం పార్టీ ముందుకు సాగుతోంది. ఈ వ‌ర్గం.. ఆ వ‌ర్గం అన్న తేడా లేకుండా.. స‌మాజంలోని అన్ని వ‌ర్గాల‌ను ప్రభావితం చేయ‌డ మే కాకుండా.. త‌న‌దైన శైలిలోవారికి చేరువ అయిన పార్టీగా కూడా.. టీడీపీ గుర్తింపు తెచ్చుకుంది. ఇప్ప‌టికి 44 సంవ‌త్స‌రాలు పూర్త‌యి.. 45 ఏట న‌వ‌య‌వ్వ‌న ద‌శ‌లోకి అడుగు పెడుతున్న స‌మ‌యంలో టీడీపీకి మ‌రింత ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు క‌నిపిస్తోంద‌నడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి యువ ర‌క్తం తోడు కావ‌డ‌మే ప్ర‌ధాన ఉదాహ‌ర‌ణ‌.

Tags
tdp history evergreen
Recent Comments
Leave a Comment

Related News