నాలుగు సంవత్సరాలుగా తాను పడుతున్న మనోవేదన తీరిందని.. ఇప్పుడు మనశ్శాంతిగా ఉందని తె లంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(kalvakuntla kavita) తెలిపారు. శుక్రవారం ఉదయం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి అభిషేక సేవలో భర్తతో కలిసి పాల్గొన్నారు. అనంతరం.. మీడియాతో మాట్లా డుతూ.. నాలుగు సంవత్సరాలుగా తాను మానసికంగా అనేక బాధలు పడ్డానని చెప్పారు. ముఖ్యంగా తనకు సంబంధం లేని కేసులో ఇరుక్కున్నానన్నారు.
ఎవరి కోసమో తనపైకేసు పెట్టారని.. జైల్లో(jail) ఉన్నప్పుడు తనకు ఎలాంటి ఆదరణ కూడా లభించలేదని అన్నారు. కానీ.. కొందరు తనను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేశారని పరోక్షంగా బీఆర్ ఎస్‌పై వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారే తనను ఈ గండం నుంచి బయటకు తీసుకువచ్చారని చెప్పారు. అందుకే.. ఆయనను కాలినడకన దర్శించుకుంటానని మొక్కుకున్నట్టుతెలిపారు. నేటితో మొక్కు తీరిందని చెప్పారు. తనకు కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం శ్రీవారి దయేనని కవిత వ్యాఖ్యానించారు.
ఇక నుంచి పూర్తిగా ప్రజలకే తన జీవితం అంకితం చేయనున్నట్టు కవిత తెలిపారు. ప్రజల సమస్యలపై గతంలో చూడని విధంగా తాను పోరాటం చేస్తానన్నారు. అనేక సమస్యలు ఉన్నాయని.. వాటిని వెలుగు లోకి తీసుకువస్తానన్నారు. తాను ఎవరికీ అనుకూలం.. ఎవరికి వ్యతిరేకం కాదన్నారు. తన వెనుక ప్రజలు తప్ప.. ఎవరూ లేరని.. తెలంగాణ సమాజమే తనను నాయకురాలిని చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమాజం రుణం తీర్చుకునేందుకే పార్టీ పెట్టానన్నారు. పార్టీ ప్రారంభించిన తర్వాత.. మరోసారి తిరుమలకు రానున్నట్టు చెప్పారు.
ఎవరు వచ్చినా..
తమ పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని కవిత తెలిపారు. అయితే.. వచ్చే నాయకులపై పూర్తి సమా చారం తెలుసుకునే కండువా కప్పుతామన్నారు. కోవర్టులకు స్థానం కల్పించబోమన్నారు. తాను విధానాల పైనే పోరాటం చేస్తానని.. వ్యక్తులపై కాదని.. పరోక్షంగా హరీష్‌రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీఆర్ ఎస్ పార్టీ ఇక, ఇప్పట్లో కోలుకోవడం కష్టమని కొందరు అంటున్నారని, తన అభిప్రాయం ఇప్పుడే చెప్పనని అన్నారు. కాగా.. ఈ పర్యటనలో భర్త అనిల్ సహా పలువురు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.