`విరోష్‌` ల‌వ్ సీక్రెట్స్‌.. ముందుగా ప్రపోజ్ చేసింది ఎవ‌రో తెలుసా?

admin
Published by Admin — March 05, 2026 in Movies
News Image

టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న(Rashmika Mandanna) ఎట్టకేలకు వివాహ బంధంతో ఒకటయ్యారు. ఫిబ్రవరి 26న అత్యంత సన్నిహితుల మధ్య వేడుకగా జరిగిన వీరి వివాహం, ఆపై మార్చి 4న హైదరాబాద్‌లో జరిగిన గ్రాండ్ రిసెప్షన్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే, తొమ్మిదేళ్ల సుదీర్ఘ ప్రేమ ప్రయాణంలో అసలు మొదటి అడుగు ఎవరిది? ఐ లవ్ యూ అని ముందుగా మనసులో మాట చెప్పింది ఎవరు? అనే ప్రశ్న ఇప్పుడు ఫ్యాన్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

వీరిద్దరి ప్రయాణం `గీత గోవిందం` సెట్స్‌లో మొదలైంది. నిజానికి విజయ్‌(Vijay)ని మొదటిసారి చూసినప్పుడు రష్మిక కొంచెం భయపడిందట. కానీ షూటింగ్ సాగుతున్న కొద్దీ ఆ భయం కాస్తా గాఢమైన స్నేహంగా మారింది. ఒకరినొకరు అర్థం చేసుకునే క్రమంలో ఆ స్నేహం కాస్తా ప్రేమ వైపు మళ్లింది. దాదాపు తొమ్మిదేళ్ల పాటు సాగిన వీరి ప్రేమ ప్ర‌యాణం ఇప్పుడు పెళ్లితో మ‌రో ద‌శ‌కు చేరింది.

అయితే ప్రేమలో పడటం సహజమే కానీ, ఆ విషయాన్ని బయటకు చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. `విరోష్`(ViRosh) విషయంలో ఆ ధైర్యం చేసింది ఎవరో కాదు.. స్వయంగా రష్మిక మందన్నేనట.`డియర్ కామ్రేడ్` సినిమా షూటింగ్ సమయంలో తమ మధ్య బాండింగ్ బాగా పెరిగిందని, ఆ సమయంలోనే రష్మిక ముందుగా తన ప్రేమను వ్యక్తం చేసిందని రీసెంట్ ప్రెస్ మీట్‌లో విజయ్ వెల్లడించాడు. తను ప్రపోజ్ చేసిన వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా విజయ్ `యెస్` చెప్పేయడంతో వీరి లవ్ స్టోరీ పట్టాలెక్కింది. ఈ సీక్రెట్ ను విజయ్ స్వయంగా రివీల్ చేయ‌డంతో ``మా నేషనల్ క్రష్ మామూలుది కాదు.. ప్రేమలో కూడా తగ్గేదేలే!`` అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Tags
ViRosh Vijay Deverakonda Rashmika Mandanna ViRosh Wedding National Crush Tollywood
Recent Comments
Leave a Comment

Related News