రోజాకు గళ్లా మాధవి కౌంటర్ అదిరింది

admin
Published by Admin — February 07, 2026 in Politics
News Image

కొడాలి నాని...రోజా...అనిల్ కుమార్ యాదవ్...అంబటి రాంబాబు...ఈ పేర్లు వినగానే గుర్తుకొచ్చేది వారి పదవులు కాదు ...వారు మాట్లాడిన భాష... వారు వాడిన బూతులు.. అధికారం పోయినా సరే, ప్రతిపక్ష హోదా దక్కకపోయినా సరే వారి తీరు మాత్రం మారలేదు. ఆ క్రమంలోనే సీఎం చంద్రబాబుపై అసభ్యకర పదజాలంతో అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. ఆ వ్యాఖ్యలు తప్పు అని ఖండించిన టీడీపీ ఎమ్మెల్యే గళ్ళా మాధవిపై వైసీపీ నేత రోజా చేసిన బాడీ షేమింగ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

రాజకీయపరంగా మాధవిని రోజా విమర్శించడంలో తప్పులేదు. కానీ, మాధవిని బాడీ షేమింగ్ చేసే హక్కు మాత్రం రోజాకు లేదు. సాటి మహిళ అయ్యుండి మరో మహిళ గురించి అసభ్యకరంగా రోజా మాట్లాడడం షాకింగ్ గా మారింది. అయితే, రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న రోజా చేసిన వ్యాఖ్యలపై తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన గల్లా మాధవి స్పందించిన తీరు ప్రశంసనీయం.

పర్సనల్ ఎజెండాతో రోజా చేసిన వ్యాఖ్యలపై స్పందించి తన టైం వేస్ట్ చేసుకోబోనని, రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయడమే తన లక్ష్యమని, పాలనపై ఫోకస్ చేస్తానని మాధవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నెటిజన్ల మనసులు గెలుచుకున్నాయి. అయితే, వైసీపీ నేతల తీరింతేనని, ముందుగా ప్రత్యర్థి పార్టీల నాయకుల వ్యక్తిత్వంపై వారు దాడి చేస్తారని, అసలు విషయంపై మాట్లాడరని మాధవి విమర్శించారు. వాళ్లకు తెలిసిన భాష అదే కాబట్టి వారు అలాగే మాట్లాడతారని, వారికి వేరే భాష రాదని సున్నితంగా చురకలంటించారు.

Tags
Ycp ex minister roja TDP mla galla Madhavi Counter
Recent Comments
Leave a Comment

Related News