వాట్ ఈజ్ దిస్ విజ‌య్.. ఆ హీరోయిన్‌ను అలా ఎలా కిస్ చేశావ్‌?(వీడియో)

admin
Published by Admin — June 01, 2025 in Movies
News Image

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవరకొండకు సరైన హిట్ పడి చాలా కాలమే అవుతుంది. గత ఏడాది `ది ఫ్యామిలీ స్టార్` మూవీతో అదృష్టం పరీక్షించుకున్నప్పటికీ.. విజయ్‌కు నిరాశే ఎదురయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా యాక్ట్ చేసిన `కింగ్‌డమ్` చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన స్పై యాక్షన్ థ్రిల్ల‌ర్ ఇది. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన కింగ్‌డమ్ జులై 4న పాన్ స్థాయిలో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నుంది.

ఈ సంగతి పక్కన పెడితే.. విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. `లైగర్` మూవీ ప్రమోషన్స్ భాగంగా హీరోయిన్ అనన్య పాండేతో కలిసి విజ‌య్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అయితే ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్.. కొంతమంది హీరోయిన్ల ఫోటోలు చూపించి.. వారిని చూస్తే ఏ ఫుడ్ గుర్తుకు వ‌స్తుందో చెప్పమ‌న‌గా విజయ్ స‌మాధానాలు ఇచ్చాడు.

జాన్వీ కపూర్ పేరు చెప్పగానే లడ్డు అని.. సారా అలీఖాన్ ను చూపించగానే కుర్‌కురే అని విజయ్ చెబుతాడు. ఆపై అనన్య పాండే ఫోటో చూపించ‌గా.. పాప్సిక‌ల్స్ అని విజయ్ సమాధానం చెప్తాడు. అందుకు యాంకర్ ఏ ఫ్లవర్ అని ప్రశ్నించగా.. వెనీలా అని అంటాడు. అక్క‌డితో ఆగ‌కుండా `నాకెందుకో అన‌న్య‌ను చూసిన‌ప్పుడ‌ల్లా బుగ్గ‌మీద ముద్దు పెట్టాల‌నిపిస్తుంది` అంటూ విజ‌య్ మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టారు. వెంట‌నే అన‌న్య `ఓకే యాకెన్..` అని అన‌డంతో ట‌క్కున విజ‌య్ ఆమెను కిస్ చేసేస్తాడు. ఈ వీడియోనే ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మార‌డంతో.. నెటిజ‌న్లు `ఇదెప్పుడు జ‌రిగింది రా` అంటూ షాక్ అవుతున్నారు. `వాట్ ఈజ్ దిస్ విజ‌య్.. ఆ హీరోయిన్‌ను అలా ఎలా కిస్ చేశావ్‌.. ఇది చూస్తే ర‌ష్మిక ఫీల్ అవ్వ‌దా` అంటూ కొంద‌రు నెటిజ‌న్లు స‌ర‌దాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా, 2022లో విడుద‌లైన `లైగ‌ర్‌` చిత్రం దారుణ‌మైన ఫ‌లితాన్ని మూట‌గ‌ట్టుకుంది. విజ‌య్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ గా నిలిచింది.

Tags
Ananya Pandey Bollywood liger Telugu News Tollywood Vijay Deverakonda viral video
Recent Comments
Leave a Comment

Related News