‘ఆదర్శ కుటుంబం’ రీషూట్లు.. రిలీజ్ వాయిదా.!

admin
Published by Admin — October 05, 2026 in Movies
News Image

టాలీవుడ్(Tollywood) సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ నాగవంశీ సినిమాల ఎంపికలో ఎంత స్మార్ట్‌గా ఉంటారో, ప్లానింగ్ విషయంలో మాత్రం అంతకంటే ఎక్కువగా తడబడుతుంటారనే టాక్ ఎప్పట్నుంచో ఉంది. ఆయన కూడా ఈ విషయాన్ని చాలాసార్లు సరదాగా ఒప్పుకున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో జరిగే పరిణామాలు మాత్రం ఇదే నిజమని నిరూపిస్తుంటాయి. ఇప్పుడు మరోసారి ఈ ప్రొడ్యూసర్ ప్లానింగ్ లోపాలు, ఆయన బ్యానర్ నుంచి వస్తున్న మోస్ట్ అంటెసిపేటెడ్ ప్రాజెక్ట్‌ను ఇబ్బందుల్లోకి నెట్టేశాయి.

విక్టరీ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం ఏకె 47(Adarsha Kutumbam AK 47)’ సినిమా విడుదల మరోసారి వాయిదా పడటం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌‌గా మారింది. మొదట అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా, ఆ తర్వాత అక్టోబర్ 9కి షిఫ్ట్ అయింది. కానీ, అక్కడ కూడా పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇప్పుడు రిలీజ్‌ను మరింత ముందుకు జరపాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. అసలు ఈ హడావుడి వాయిదాల వెనుక రెండు బలమైన కారణాలు వినిపిస్తున్నాయి.

మొదటి కారణం పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడం. అవుట్‌పుట్‌లో ఎలాంటి లోపాలు ఉండకూడదనే ఉద్దేశంతో ఫైనల్ వర్క్ మీద టీమ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే మరోవైపు ఇండస్ట్రీలో మరో ఆసక్తికరమైన చర్చ కూడా గట్టిగానే నడుస్తోంది. ఈ చిత్రానికి సరైన బజ్ లేకపోవడం, పైగా బ్లాస్ట్‌ సినిమాతో పోలికలు రావడం వల్ల సెకండాఫ్‌లో కొన్ని కీలకమైన రీషూట్లు చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ కారణం వల్లే రిలీజ్ డేట్ అక్టోబర్ 16 లేదా 30కి మారే అవకాశం ఉందంటూ తాజాగా వార్తలు గుప్పుమన్నాయి. ఏదేమైనా, రిలీజ్ డేట్స్ మార్చడంలో తనకంటూ ప్రత్యేక శైలిని కలిగి ఉన్న నాగవంశీ(Naga Vamsi), ఈసారైనా అనుకున్న తేదీకి సినిమాను దించుతారా లేదా అనేది వేచి చూడాలి.

Tags
Adarsha Kutumbam Adarsha Kutumbam AK 47 Venkatesh Tollywood Telugu Cinema Naga Vamsi Trivikram
Recent Comments
Leave a Comment

Related News