మోదీ భక్తి గురించి రేవంత్ షాకింగ్ కామెంట్స్!

admin
Published by Admin — September 30, 2026 in National
News Image

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స‌హా బీజేపీ నాయ‌కులు రాముడిని చోరీ చేశార‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో ఒక్క‌సారిగా స‌భ‌లో న‌వ్వులు విరిసాయి. ఓ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆయ‌న‌.. ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇస్తూ.. దేవుడి ప్ర‌స్తావ‌న తీసుకువ‌చ్చారు. బీజేపీ నాయ‌కులు.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సైతం.. రాముడి గురించి గొప్ప‌గా చెబుతున్నారని..తెల్లారి లేస్తే.. రాముడు రాముడు అంటూ.. జైశ్రీరాం నినాదాల‌తో హోరెత్తిస్తున్నా ర‌ని అన్నారు. కానీ, అదేస‌మ‌యంలో శివుడి గురించి ఎందుకు మాట్లాడ‌ర‌ని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు.

రాముడు ఉన్న‌వారి దేవుడ ని.. ధ‌న‌వంతుడ‌ని, ఒక రాజ్యానికి రాజు కాబ‌ట్టి.. మోడీకి ఆద‌ర్శంగా ఉన్నాడ‌ని వ్యాఖ్యానించారు. అదే శివుడు పేద వాడుకాబ‌ట్టి.. పేద‌ల దేవుడు కాబ‌ట్టి.. ఆయ‌న‌ను విస్మ‌రించార‌ని అన్నారు. తాము ఇద్ద‌రినీ స‌మానంగానే చూస్తామ‌ని చెప్పుకొచ్చారు. త‌మ‌కు ఆర్యులు, ద్ర‌విడులు స‌మాన‌మేన‌ని అన్నారు. ప్ర‌తి ఒక్క‌రిలోనూ మ‌నిషిని చూస్తామ‌ని చెప్పారు. 

 స‌మాజంలో పెద్ద‌ల‌కు ఉన్న విలువ సామాన్యుల‌కు కూడా ఉండాల‌ని కోరుకుంటున్నామ‌ని.. అందుకే రాష్ట్రంలో పేద‌ల‌కు పెద్ద పీట వేస్తున్నామ‌ని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ విష‌యంలో అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాల‌తో పాటు.. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో పేద‌ల‌కు సొంత ఇల్లు కూడా నిర్మించి ఇస్తున్నామ‌ని చెప్పారు. ఓట్లు వేసేది.. పోలింగ్ బూతుకు వ‌చ్చేది పేద‌లే ఎక్కువగా ఉంటున్నార‌ని.. వారిని ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం ప్ర‌భుత్వాల‌కు ఉంటుంద‌న్నారు.

కానీ.. మోడీ స‌ర్కారు పెద్ద‌ల స‌ర్కారు అని విమ‌ర్శించారు. రాజ‌కీయంగా దూకుడు.. మోడీని టార్గెట్ చేసే విష‌యంలో రేవంత్ రెడ్డి రాజ‌కీయంగా దూకుడు పెంచారు. పెద్ద‌లు-పేద‌ల విష‌యాన్ని గ‌త కొంత కాలంగా అనేక పార్టీలు ప్ర‌స్తావిస్తూ.. మోడీపై విమ‌ర్శ‌లు చేస్తున్నా.. ఇప్పుడు ఏకంగా రాముడు-శివుడిని అడ్డం పెట్టి.. మోడీ స్వ‌భావాన్ని రేవంత్ రెడ్డి పేర్కొన‌డం .. రాజ‌కీయంగా దూకుడు పెంచార‌న్న వాద‌న వినిపించేలా చేసింది. అయితే.. ప్ర‌ధాని మోడీ.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం వార‌ణాసిని డెవ‌ల‌ప్ చేసిన విష‌యం ఇక్క‌డ ప్ర‌స్తావ‌నార్హం.

Tags
Cm revanth reddy pm modi lord ram lord siva Shocking comments
Recent Comments
Leave a Comment

Related News